గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2022 (11:43 IST)

లేట్ హవర్స్ పబ్‌లో వుండటం మా తప్పు కాదు.. బద్నాం చేయకండి..?

Kushitha Kallapu
రాడిసన్ పబ్‌ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఈ కేసులో చిక్కుకున్న  జూనియర్ ఆర్టిస్ట్ కల్లపు కుషితా సెల్ఫీ వీడియో ద్వారా దీనిపై క్లారిటీ ఇచ్చింది. లేట్ హవర్స్ పబ్‌లో వుండటం మా తప్పు కాదు.. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారనే విషయం తమకు తెలియదని తేల్చి చెప్పేసింది. అది తెలిస్తే అక్కడి ఎందుకు వెళ్తామని ప్రశ్నించింది. 
 
మీడియా వాళ్లు కొంచం సమన్వయం పాటించాలని కుషితా ఆ వీడియోలో వేడుకుంది. పబ్‌కి వచ్చిన వాళ్ళని అందరిని బద్నామ్ చేయడం సరికాదని.. తాము ఇప్పుడు ఇప్పుడే సినిమా రంగంలో ఎదుగుతున్నామని వెల్లడించింది. తాము పార్టీకి మాత్రమే వెళ్లామని.. దయచేసి మీడియా వారు మమ్మల్ని బద్నాం చేయకండంటూ జూనియర్ ఆర్టిస్ట్ కల్లపు కుషితా విజ్ఞప్తి చేసింది. 
 
పార్టీ ముగిశాక బయటికి వెళ్దామని అనుకునేలోపే పోలీసులు ఎంట్రీ ఇచ్చారని.. అక్కడ డ్రగ్స్ వినియోగం జరుగతుందన్నందుకు అందరిని బాధ్యులను చేయడం, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం సరికాదని పేర్కొంది. పోలీసుల విచారణకు సహకరించామని బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు కూడా సిద్ధంగా వున్నామని తెలిపింది.