గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Modified: శనివారం, 11 సెప్టెంబరు 2021 (23:33 IST)

మైనార్టీ కుటుంబం సెల్ఫీ వీడియోపై సీఎం జగన్ స్పందన

అమరావతి: కడప జిల్లా దువ్వూరుకు చెందిన ఓ మైనార్టీ కుటుంబం సోషల్‌ మీడియాలో పెట్టిన సెల్ఫీ వీడియోపై సీఎం జగన్‌ స్పందించారు. కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌తో మాట్లాడారు. ఎస్పీకి ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. వారంలో సమస్య పరిష్కరించాలని ఎస్పీ, కలెక్టర్‌కు సీఎం ఆదేశించారు. మైదుకూరు గ్రామీణ సీఐ వ్యవహారంపై విచారణ జరిపి వారంలోగా చర్యలు తీసుకోవాలన్నారు. భూమికి సంబంధించి వారంలో కలెక్టర్‌ విచారించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
 
వీడియోపై రాత్రే స్పందించాం: ఎస్పీ
అంతకముందు సెల్ఫీ వీడియో చూసి అక్బర్‌ బాషా కుటుంబాన్ని ఎస్పీ తన వద్దకు పిలిపించుకున్నారు. బాధిత కుటుంబం, కడప వైకాపా నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అక్బర్‌బాషా సెల్ఫీ వీడియోపై రాత్రి 11.20 గంటలకు స్పందించామన్నారు. వెంటనే బాధితుడి ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నట్లు వివరించారు.

ఈ నెల 9న ఎస్పీ స్పందన కార్యాలయంలో అక్బర్‌ పిటిషన్‌ ఇచ్చారని తెలిపారు. ‘‘సీఐ వ్యవహారంపై విచారణకు అదనపు ఎస్పీ దేవప్రసాద్‌ను నియమించాంసీఐ కొండారెడ్డిని 2 రోజుల పాటు విధుల నుంచి తప్పించాం. భూ సమస్య పరిష్కరించాలని సీఎంవో కూడా ఆదేశాలిచ్చింది’’ అని ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.*