శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: శనివారం, 28 ఆగస్టు 2021 (20:56 IST)

సిమ్లాలో ఉన్నా, డిస్ట్రబ్ చేయొద్దు: జీన్స్ ప్యాంటులో సీఎం జగన్

వీకెండ్ టూర్‌లో ఉన్నారు ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి. చల్లటి ప్రదేశాలను ఆస్వాదిస్తున్నారు. ఎప్పుడూ పాలనలో బిజీగా ఉండే జగన్మోహన్ రెడ్డి మూడురోజుల పాటు రెస్ట్ తీసుకోవడానికి బయటి ప్రాంతాలలో తిరుగుతున్నారు.
 
భార్య భారతితో కలిసి సిఎం జగన్ పర్యటనలో వున్నారు. ప్రశాంతత కోసం బయటకు వచ్చామని.. అనవసర విషయాలను అస్సలు మాట్లాడవద్దంటున్నారట జగన్. వైసిపి అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ పాలనలో జగన్మోహన్ రెడ్డి రెండుసార్లు మాత్రమే పర్యటనల కోసం బయటకు వెళ్ళారు.
 
ఫ్యామిలీతో గడపడం కూడా చాలా తక్కువైంది. దీంతో వీకెండ్ కావడం.. అందులోను ఆయన పెళ్లిరోజు కావడంతో చాలా ప్రశాంతంగా సిఎం సిమ్లాలో బస చేస్తున్నారు.