సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బెల్లం దుర్గ
విజయవాడ నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, సీఎం జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఆయన అగ్రిగోల్డ్ బాధితుల పాలిట దేముడని అభివర్ణించారు. అగ్రి గోల్డ్ బాధితుల ఖాతాల్లో 20 వేల రూపాయలు నగదు జమ చేస్తున్నందుకు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో పాటు ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ అండగా నిలవడం ఆనందకరమని, జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మరోసారి నిరూపించారన్నారు.
జగన్ చేస్తున్న మంచి పనులను పేద ప్రజలు ఎప్పటికి మర్చిపోరని, ఎన్నో సంవత్సరాలు నుంచి ఎదురుచూస్తున్న అగ్రి గోల్డ్ బాధితులకు జగన్ ఇచ్చిన మాట ప్రకారం వారికి అండగా నిలిచారని కొనియాడారు. అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదు వేయటం ఎన్నటికీ మర్చిపోలేని విషయమని, జగన్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని పేద ప్రజలకు గట్టి నమ్మకం ఏర్పడిందని అన్నారు.
జగన్ చేస్తున్న మంచి పని వలన అగ్రి గోల్డ్ బాధితులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలు అమలుతో పాటు, మోసపోయిన పేద ప్రజల సమస్యలను కూడా పరిష్కరం చేస్తున్నారని సీఎంని కొనియాడారు.