మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 ఆగస్టు 2021 (11:55 IST)

సీఎం జగన్ పర్యటనకు ముందు భీమవరంలో పేలుడు.. ఆవు గడ్డి మేస్తుండగా..?

పశ్చిమ గోదావరి జిల్లాలో బాంబు కలకలం రేగింది. భీమవరం-ఉండి రోడ్లోని ఓ ఖాళీ స్థలంలో బాంబు పేలింది. ఆవు గడ్డి మేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆవుకు తీవ్రగాయాలు కాగా పేలుడు ధాటికి ఘటనాస్థలంలో భారీ గుంత ఏర్పడింది. 
 
ఆదివారం సీఎం జగన్‌ భీమవరంలో పర్యటించనున్నారు. ఆ ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే పేలుడు జరగడంతో పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. పేలుడు జరిగిన పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. పేలింది నాటుబాంబా లేక వేరేదా.? అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
సీఎం జగన్‌ పర్యటనకు ముందురోజు బాంబు పేలుడు తీవ్ర కలకలం రేపింది. భీమవరం-ఉండి రహదారి వెంట ఆవు మేత మేస్తుండగా బాంబు పేలింది. పేలుడు ధాటికి ఆవు తీవ్రంగా గాయపడింది.