మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శనివారం, 14 ఆగస్టు 2021 (11:07 IST)

సీనియ‌ర్ కార్య‌క‌ర్త కోసం ఆగ‌మేఘాల‌పై ఆస్ప‌త్రికొచ్చిన చంద్ర‌బాబు

పార్టీకి సేవ‌లు అందించిన సీనియ‌ర్ కార్య‌క‌ర్త కోసం పార్టీ అధినేత దిగివ‌చ్చారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై నేరుగా వ‌చ్చి వాక‌బు చేశారు. క్ర‌మ‌శిక్ష‌ణ గ‌ల కార్య‌క‌ర్త‌లున్న పార్టీగా పేరొందిన టీడీపీ అధినేత ఔదార్య‌మిది.

కృష్ణా జిల్లా ప్ర‌సాదంపాడుకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ అభిమాని బొప్పన రాఘ‌వేంద్ర‌రావు విజ‌య‌వాడ‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అమ‌రావ‌తి నుంచి హైద‌రాబాద్ వెళ్లేందుకు సిద్ధ‌మైన చంద్ర‌బాబు...హుటాహుటిన ఆస్ప‌త్రికి చేరారు. బొప్పన రాఘవేంద్రరావుని ప‌రామ‌ర్శించారు.

త‌న ఆశ‌, శ్వాస అయిన తెలుగుదేశంని న‌డిపించే నాయ‌కుడ్ని చూశాన‌న్న తృప్తి ఆయ‌న క‌ళ్ల‌ల్లో క‌నిపించింది. కృష్ణా జిల్లాలో 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి క‌ర‌డుగ‌ట్టిన కార్య‌క‌ర్త‌గా, నాయ‌కుడిగా పార్టీకి విస్తృత సేవలందించారు రాఘ‌వేంద్ర‌రావు. దుర్గాపురం ప్రాంత కార్పోరేటర్, వీజీటియం వుడా స‌భ్యులుగా ప‌నిచేశారు.

తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్యక్షులు అన్న‌ ఎన్టీఆర్ కారులో వుండి భోజ‌నం చేస్తుంటే..కారు అద్దంలోంచి చూస్తున్న ఫోటో అంద‌రికీ చిర‌ప‌రిచిత‌మే. కారు అద్దంలోంచి అన్న‌గారిని ఆప్యాయంగా ప‌ల‌క‌రించిన బొప్ప‌న రాఘ‌వేంద్ర‌రావు ఇపుడు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుండ‌టంతో ఆయ‌న్ని అధినేత చంద్ర‌బాబు ప‌రామ‌ర్శించారు.