గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , సోమవారం, 23 ఆగస్టు 2021 (10:55 IST)

ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరికి సీఎం జ‌గ‌న్ నివాళి

ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి నేడు. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ పూలుజల్లి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా పాల్గొన్నారు.

ఆంధ్ర కేస‌రి ఎంతో పోరాట ప‌టిమ గ‌ల నాయ‌కుడ‌ని, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్య‌మంత్రిగా ఆయ‌న వ‌జ్ర సంకల్పంతో ప‌ని చేశార‌ని కొనియాడారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆశ‌యాల‌కు అనుగుణంగా ప‌నిచేసి, న‌వ్యాంధ్ర‌ప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తామ‌ని పేర్కొన్నారు.