మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: vijayawada , సోమవారం, 30 ఆగస్టు 2021 (10:29 IST)

శ్రీ కృష్ణాష్ట‌మి శుభాకాంక్ష‌లు... సిమ్లా నుంచి తెలిపిన సీఎం జ‌గ‌న్!

గ‌త మూడు రోజులుగా హాలీడే ట్రిప్ లో ఉన్న ఏపీ సీఎం జ‌గ‌న్, ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌జ‌లంద‌రికీ శ్రీ కృష్ణాష్ట‌మి శుభాకాంక్ష‌లు తెలిపారు. స‌కుటుంబ‌, స‌పరివార స‌మేతంగా సిమ్లాకు వెళ్ళిన సీఎం జ‌గ‌న్ అక్క‌డి నుంచి శ్రీ కృష్ణాష్ట‌మి ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు అందించారు.
 
ప్ర‌పంచానికి గీత‌ను బోధించి, ప్రేమ త‌త్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా క‌టాక్షాలు మ‌న అంద‌రిపైనా స‌దా ఉండాల‌ని సీఎం జ‌గ‌న్ కోరారు. ఈ శుభాకాంక్ష‌ల‌ను ఆయ‌న త‌న ట్టిట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. 
 
ఇటీవ‌ల త‌న 25వ పెళ్ళి రోజు జరుపుకొన్న సీఎం జ‌గ‌న్, త‌న టూర్ పూర్తి చేసుకుని ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని త‌న తాడేప‌ల్లి క్యాంప్ ఆఫీసుకు తిరిగి రానున్నారు.  ఈ నెల 28న త‌న పెళ్లి రోజుతో సహా, మరో నాలుగు రోజుల పాటు కుటుంబ సభ్యులతో సీఎం జగన్ సిమ్లాలో గడిపి, ఐదు రోజుల తర్వాత తిరిగి రాష్ట్రానికి రానున్నారు.