గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 మార్చి 2022 (16:40 IST)

బీసీ జ‌న‌గ‌ణ‌నను చేపట్టాలి: ప్రధాని మోదీతో వైకాపా ఎంపీల భేటీ

దేశంలో బీసీ జ‌న‌గ‌ణ‌నను ప్ర‌త్యేకంగా చేప‌ట్టాల‌ని చాలా పార్టీలు డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌యంపై తెలంగాణ‌కు చెందిన అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా ప‌లుమార్లు కేంద్రానికి విన‌తి ప‌త్రాలు స‌మ‌ర్పించింది. తాజాగా వైసీపీ కూడా ఇదే డిమాండ్‌ను కేంద్రం ముందుకు తీసుకురావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.
 
ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో వైసీపీ ఎంపీలు బుధవారం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా బీసీ జ‌న‌గ‌ణ‌న‌ను చేపట్టాల‌ని వారు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు వైసీపీ ఎంపీలు ప్ర‌ధానికి ఓ విన‌తి ప‌త్రాన్ని స‌మ‌ర్పించారు.