సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (17:49 IST)

జీవితా రాజ‌శేఖ‌ర్‌ల‌పై ఛీటింగ్ కేసు - నిరాధార ఆరోప‌ణ‌లు - జీవిత‌

Jeevita Rajasekhar
Jeevita Rajasekhar
హీరో రాజశేఖర్‌కు చాలా కాలం త‌ర్వాత గ‌రుడ వేగ  సినిమా స‌క్సెస్ ఇచ్చింది. ఇప్పుడు అదే సినిమా వారిని జైలుకు పంపేలా చేస్తుంద‌ని టాక్ ఇండ‌స్ట్రీలో నెల‌కొంది. ఇటీవ‌లే రామ్‌గోపాల్ వ‌ర్మ‌, న‌ట్టికుమార్‌ల ఇష్యూ తెలిసిందే. న‌న్ను మోసం చేశాడ‌ని వ‌ర్మ‌పై న‌ట్టికుమార్ కేసు వేశాడు. దాంతో డేంజ‌ర్ సినిమా ఆగిపోయింది. ఇక ఇప్పుడు జీవితా రాజ‌శేఖ‌ర్‌ల విష‌యానికి వ‌స్తే,  జీస్టర్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ ఫిలిం ప్రొడక్షన్ మేనేజింగ్ డైరెక్టర్ హేమ జీవితా రాజ‌శేఖ‌ర్లు మోసం చేశార‌ని ఆరోపించింది. 
 
ఆమె చేసిన ఆరోప‌ణ‌ల‌పై తమిళనాడులోని, తిరువళ్ళూరు జిల్లా ఎస్పి రాజశేఖర్ పై క్రిమినల్ కేసు నమోదు చేసారు. హేమ మాట్లాడుతూ, ” రాజశేఖర్ తండ్రి వరద రాజన్  వ‌ల్ల మాకు వీరు పరిచయమయ్యారు. రాజశేఖర్‌తో ఎవ‌రూ సినిమా చేయ‌క‌పోవ‌డంతో మేము `పిఎస్-4 గరుడ వేగ` తీసాం. తన ఆస్తులను మా వద్ద తాకట్టు పెట్టి రూ. 26 కోట్లు తీసుకున్నారు. ఇక సినిమా పూర్తయ్యాక సినిమాకు డబ్బు పెట్టిన మామామల్ని వదిలేసి సంజయ్ రామ్ కు సినిమాను అమ్మేశారు. ఈ విష‌యమై చాలా సార్ల చెప్పినా వినిపించుకోలేదు. ఆఖ‌రికి కేసు పెట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.. వారి వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం” అని చెప్పుకొచ్చింది. ఇక  జీస్టర్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ ఫిలిం ప్రొడక్షన్ ఫౌండర్ కోటేశ్వరరాజు మాట్లాడుతూ” అవకాశం కోసం జీవిత,రాజశేఖర్ మమ్మల్ని వాడుకున్నారు.. వారు ఇప్పటివరకు మాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. త్వరలో రాజశేఖర్ జైలుకు వెళ్తాడు..జీవిత చాలా డేంజరస్ మనస్తత్వం కలిగిన మనిషి అని తెలిపారు.
 
రేపు పూర్తివివ‌రాలు చెబుతాం- జీవిత‌
మాపై కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై రేపు (ఏప్రిల్ 23) జరగబోయే 'శేఖర్' సినిమా విలేఖరుల సమావేశంలో పూర్తి ఆధారాలతో స్పందిస్తా. అప్పటి వరకు ఎటువంటి కథనాలు ప్రసారం చేయవద్దని  జీవితా రాజశేఖర్ మ‌న‌వి చేశారు.