గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (10:27 IST)

వాస్త‌వ క‌థ ఆధారంగా 1996 ధర్మపురి - ప్రీరిలీజ్ వేడుక‌లో వ‌క్త‌లు

1996 Dharmapuri Prerelease
1996 Dharmapuri Prerelease
1996 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలోని  రాజ గడిలో పని చేసే ఓ జీతగాడు.. బీడీలు చుట్టే అమ్మాయి మధ్య జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా 1996 ధర్మపురి. శేఖర్ మాస్టర్ సమర్పణలో  భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ లో గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా జగత్ దర్శకత్వంలో భాస్కర్ యాదవ్ దాసరి ఈ సినిమాను నిర్మించారు.ఓషో వెంకట్ సంగీతం ఆందించిన‌ ఈ చిత్రానికి మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి.రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేసింది.
 
ఈ కార్యక్రమానికి హాజ‌రైన తెలంగాణ సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  మాట్లాడుతూ..జగత్ ధర్మపురి పేరుపైన సినిమా తీస్తున్నారు అంటే నాకు అక్షర్యం కలిగించింది.ధర్మపురి లో ఏరియాలో వుండే గ్రామీణ వాతావరనాన్ని  కళ్ళకు కట్టినట్లు చూయిస్తూ అక్కడ  జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమా తీస్తున్నారు. గోదావరి తీరాన చాలా పురాతన మైనటువంటి ధర్మపురి టెంపుల్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు ఆ టెంపుల్ పేరిట సినిమా రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. 
 
మైత్రి మూవీ మేకర్స్ రవి మాట్లాడుతూ..నిర్మాత మంచి కథను సెలెక్ట్ చేసుకున్నాడు.జగత్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు.ఈ ట్రైలర్ చూస్తుంటే రంగస్థలం ఛాయలు కనిపిస్తున్నాయి.గగన్ రంగస్థలం లో చిన్న పాత్ర చేశాడు.ఈ సినిమా ద్వారా హీరో అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం దర్శక, నిర్మాత లకు రంగస్థలం అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. 
 
ప్రముఖ దర్శకుడు మారుతి మాట్లాడుతూ..దర్శకుడు జగత్ నా దగ్గర లవర్స్ సినిమా నుండి చాలా  సినిమాలకు కో డైరెక్టర్ గా చేశాడు. తరువాత ఒకరోజు నన్ను కలసి రియలిస్టిక్ కథతో సినిమా తీస్తున్నాను అని చెప్పడంతో చాలా ఆనందంగా వేసింది.ఈ చిత్రానికి శేఖ‌ర్ మాస్ట‌ర్ స‌మ‌ర్ప‌ణ చేయ‌డం మా జగత్ కి చాలా హెల్ప్ అయ్యింది. నేను 1996 ధ‌ర్మ‌పురి చిత్రాన్ని చూశాను. ఈ చిత్రం చాలా రియ‌లిస్టిక్ గా నేచుర‌ల్ గా తీసారు. ఈ చిత్రం చూసేవారు కచ్చితంగా థ్రిల్ పీల‌వుతారు. ఓషో వెంక‌టేష్ గారు సంగీతం చాలా బాగుంది. జగత్ మంచి కథను సెలెక్ట్ చేసుకుని తీసిన  చిత్రం అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు. 
 
చిత్ర స‌మ‌ర్ప‌కుడు శేఖ‌ర్ మాస్ట‌ర్ మాట్లాడుతూ.. రూరల్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన ట్రూ బేస్డ్ లవ్ స్టొరీ 1996 ధర్మపురి. ద‌ర్శ‌కుడు జ‌గ‌త్ క‌థ చెప్పిన‌రోజే ఈ సినిమా అంద‌రి హ్రుద‌యాల‌కి ద‌గ్గ‌ర‌వుతుంద‌ని నేను ఈ చిత్రం లో పార్ట‌య్యాను. చాలా రియ‌లిస్టిక్ గా చాలా నేచుర‌ల్ ఫెర్‌ఫార్మెన్స్ తో తీసిన ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది. నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు.ఓషో వెంక‌టేష్ ఇచ్చిన మ్యూజిక్ చాలా పెద్ద మ్యాజిక్ చేసింది. ఏప్రిల్ 22 ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నాం. అని అన్నారు 
 
నిర్మాత యస్.కె.యన్ మాట్లాడుతూ..జగత్ మాకు చిరకాల మిత్రుడు.ఈ ట్రైలర్ చూస్తుంటే చాలా రగ్ద్ గా కనిపిస్తుంది. ఈ చిత్రం తీసిన యూనిట్ అందరికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
 
చిత్ర నిర్మాత భాస్కర్ మాట్లాడుతూ..మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికే ధన్యవాదాలు.డీఫ్రెంట్ సబ్జెక్ట్ తో ఈ నెల 22 న వస్తున్న మా సినిమాను సపోర్ట్ చేస్తూ రిలీజ్ చేస్తున్న ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ వారికి. గీతా ఆర్ట్స్ వారికీ మా ధన్యవాదాలు.ఇందులో నటించిన వారంతా వారి  పాత్రలలో లీనమై అద్బుతంగా నటించారు. టెక్నీషియన్ అందరూ కూడా ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు.ఒక పొరి చుట్టూ ఒక పోర‌డు వెంట‌ బ‌డుతుంటే ఆ పొరి కచ్చే వజనే వేరు.. నాకు ఈ ప్రేమ గీమ తెల్వ‌దు న‌చ్చినోడ్ని క‌ట్టుకునుటే తెలుసు నాకు న‌చ్చినావురా దొంగ‌బాడ‌వావ్‌..అని చెప్పే హీరోయిన్ డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటుంది.ఇందులో నేను మూడు పాటలు రాశాను. ఇందులోని పాటలకు ఎంతో రెస్పాన్స్ వస్తుంది అంటే దానికి ముఖ్య కారణం శేకర్ మాస్టర్.తన వల్లే మాకు ఈ సినిమాకు ఇంత మంచి పేరు వస్తుంది.
 
 
చిత్ర దర్శకుడు జగత్ మాట్లాడుతూ..ప్రస్థానం తో నా జర్నీ స్టార్ట్ అయ్యింది.మారుతి అన్న దగ్గర కో డైరెక్టర్ గా పనిచేసి చాలా నేర్చుకున్నాను. 1996 ధర్మపురి చిత్రానికి నటీ నటులు, టెక్నీషియన్స్ అందరూ మాకు సపోర్టు గా నిలుస్తూ చాలా కష్టపడి పని చేశారు.ఓషో వెంకట్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మార్తాండ్ వెంకటేష్ గారు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు.మేము ఈరోజు సినిమా పూర్తి చేయగలిగాము అంటే దానికి ముఖ్య కారణం శేకర్ మాస్టర్. నిర్మాత భాస్కర్ గారు మాకు ఎం కావాలన్నా అన్ని విధాల సహకరించారు. ఈ సినిమాలోని నాగమల్లి,సూరి క్యారెక్టర్ లు న్యాచురల్ గా ఉంటాయి.సినిమా అయిపోయిన తర్వాత మీతోనే ధియేట‌ర్ బ‌య‌ట‌కి ట్రావెల్ అవుతాయి.ఈ కథకు గగన్ అయితే బాగుంటుందని సెలెక్ట్ చేశాను తప్ప గగన్ కొసం ఈ సినిమా చెయ్యలేదు.ఈ నెల 22 న వస్తున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
హీరో గగన్ మాట్లాడుతూ..జగత్ గారు నాకు కథ చెపితే అందులో ఒక మంచి క్యారెక్టర్ ఇస్తాడేమో అనుకున్నాను. తరువాత ఇందులో నువ్వే హీరో అంటే నేను మొదట నమ్మలేదు.రియలిస్టిక్ గా తను చెప్పిన కథ నాకు ఎంతో నచ్చింది. 1996 ప్రాంతంలో ధర్మపురి లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తీసిన ఈ సినిమాలో నేను హీరోగా నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.చిన్న చిన్న రోల్స్ చేసుకునే నన్ను హీరోగా చేసి నాలోని ట్యాలెంట్ ను బయటకు తీసిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
 
హీరోయిన్ అపర్ణ మాట్లాడుతూ.. ఇది నా మొదటి చిత్రం.ఇందులో నేను నాగమల్లి క్యారెక్టర్ చేశాను.ఇందులో లీడ్ రోల్ చేసిన వారంతా కొత్తవారే..ఈ మూవీ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రపీ చేస్తున్నారు అంటే టెన్షన్ పడ్డాను.తను మాకెంతో సపోర్ట్ ఇచ్చారు.మంచి కంటెంట్ తో వస్తున్న 1996 ధర్మపురి వేరే లెవెల్ లో ఉంటుంది.అందరూ తప్పకుండా మా సినిమాను చూసి ఆశీర్వదించాలని అన్నారు. 
 
డార్లింగ్ స్వామి మాట్లాడుతూ.. దర్శకుడు మంచి టాలెంటెడ్ పర్సన్. తను చక్కటి ఎమోషనల్ లవ్ స్టొరీ ని సెలేక్ట్ చేసుకొని తీశారు.టీం అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు. 
ఇంకా ఈ కార్యక్రమంలో నటుడి జీవి ,నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ మరియు చిత్ర యూనిట్ సభ్యులు యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన 1996 ధర్మపురి సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు. 
 
నటీనటులు:
గగన్ విహారి, అపర్ణ దేవి, అఖండ నాగ మహేష్, పలాస జనార్దన్, కేశవ, బస్టాప్ కోటేశ్వరరావు, రాగిని, జయప్రద, మధుమిత,శంకర్ తదితరులు.. 
 
టెక్నికల్ టీమ్:
రచన, దర్శకత్వం: జగత్
సమర్పణ: శేఖర్ మాస్టర్
బ్యానర్: భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా
నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
కొరియోగ్రాఫర్: శేఖర్ మాస్టర్
సంగీతం: ఓషో వెంకట్
కెమెరా : కృష్ణ ప్రసాద్
PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్