మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (15:18 IST)

'నీ గెడకర్ర మొఖందానా.. షూటింగ్ స్పాట్‌కొచ్చి కొడతా' : రకుల్‌కు శ్రీరెడ్డి వార్నింగ్ (Video)

ఆ మధ్య కాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై నటి శ్రీరెడ్డి మండిపడింది. ఆ తర్వాత ఈ వ్యవహారంపై శ్రీరెడ్డి పెద్ద రచ్చే చేసింది. మా సభ్యత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏకంగా అర్థనగ్న ప్ర

ఆ మధ్య కాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై నటి శ్రీరెడ్డి మండిపడింది. ఆ తర్వాత ఈ వ్యవహారంపై శ్రీరెడ్డి పెద్ద రచ్చే చేసింది. మా సభ్యత్వాన్ని డిమాండ్ చేస్తూ ఏకంగా అర్థనగ్న ప్రదర్శనకు కూడా దిగింది. 
 
ఇదిలావుంటే, టాలీవుడ్‌లో 'క్యాస్టింగ్ కౌచ్' రాజ్యమేలుతోందని చెప్పిన శ్రీరెడ్డి రకుల్ చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. ఇదే విషయంపై ఆమె ఓ వీడియోను తీసి తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో శ్రీరెడ్డి చేసిన మాట్లాడిన మాటలు యధాతథంగా.... 
 
'ఒక రెక్క పీత గురించి చెబుదామని వచ్చా. కోట్ల రూపాయలు పెట్టే వారికి అర్హత ఉంటుందని.. టాలెంట‌ెడ్ వాళ్లని ప్రోత్సహిస్తారని కబుర్లు చెప్తోంది. ఏమే.. నువ్వూ నీ గెడకర్ర మొఖం. చుంచులు పీకేసిన తాటి ముంజ మొఖమొకటేసుకుని, నువ్వు మా ఊళ్లో పిల్లలాడుకునే సైకిల్ టైర్‌లా ఉంటావే. ఒక ఆడదానివని వదిలేస్తున్నాను. 
 
అసలు నీకెందుకే మా తెలుగోళ్ల గురించి, మా ఉద్యమాల గురించి. ఇక్కడకొచ్చి ఏలేద్దామని ఎందుకు ట్రై చేస్తున్నావే నువ్వు. నీకు టాలెంట్ ఉందా.. నీకు లిప్ మూమెంట్ వచ్చా అసలు. అసలు నీ మొఖానికి లంగాఓణీ వేసుకుంటే ఎలా ఉంటావో చూసుకున్నావా. అసలు మా పోరాటాల గురించి నీకెందుకే. నోరు మూసుకుని కూర్చో ఇంట్లో. లేకపోతే నీ షూటింగ్ స్పాట్‌కొచ్చి మరీ కొడతాం అంటూ పేర్కొంది.