మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: సోమవారం, 9 ఏప్రియల్ 2018 (18:12 IST)

అమ్మా శ్రీరెడ్డీ... ప్లీజ్ ఇల్లు ఖాళీ చేయమ్మా... నీకు దణ్ణం పెడతాను...

తెలుగు సినీ ఫిలిం అసోసియేషన్ గుర్తింపు కార్డు ఇవ్వడంతో పాటు తనకు సినిమాల్లో అవకాశాలు కల్పించాలంటూ శ్రీరెడ్డి రెండురోజుల క్రితం చేసిన రచ్చరచ్చ తెలిసిందే. ఫిలిం ఛాంబర్ ఎదుటే బట్టలు మొత్తం విప్పి అర్థనగ్నంగా నిరసన వ్యక్తం చేసింది. తెలుగు సినీ పరిశ్రమలోన

తెలుగు సినీ ఫిలిం అసోసియేషన్ గుర్తింపు కార్డు ఇవ్వడంతో పాటు తనకు సినిమాల్లో అవకాశాలు కల్పించాలంటూ శ్రీరెడ్డి రెండురోజుల క్రితం చేసిన రచ్చరచ్చ తెలిసిందే. ఫిలిం ఛాంబర్ ఎదుటే బట్టలు మొత్తం విప్పి అర్థనగ్నంగా నిరసన వ్యక్తం చేసింది. తెలుగు సినీ పరిశ్రమలోనే ఇప్పటివరకు ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు లేవు. ఒక్క తెలుగు రాష్ట్రంలోనే కాదు.. యావత్ దేశంలోనే శ్రీరెడ్డి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
తెలుగు అమ్మాయికి తెలుగు సినీ పరిశ్రమలో అవకాశాలు లేవు. ఎవరెవరికో అవకాశాలు ఇస్తున్నారు. భాష తెలియని వారికి అవకాశాలు వస్తున్నాయంటూ శ్రీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది. నెటిజన్లందరూ శ్రీరెడ్డిపై విమర్శలు చేశారు. ఇలాంటి పని చేయకుండా న్యాయపోరాటం శ్రీరెడ్డి చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అయితే సినీపరిశ్రమలోని ముఖ్యులందరూ కూడా శ్రీరెడ్డిపై విరుచుకుపడ్డారు. 
 
శ్రీరెడ్డితో ఎవరైనా సినిమా చేస్తే వారి సభ్యత్వం కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. నటీమణులు కూడా శ్రీరెడ్డిపై దుమ్మెత్తిపోశారు. ఇప్పుడూ ఎవరూ లేని అనాధలా శ్రీరెడ్డి పరిస్థితి తయారైంది. చివరకు తను నివాసమున్న ఇంటి యజమాని కూడా ఇంటిని ఖాళీ చేయమన్నారు. దీంతో శ్రీరెడ్డికి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి.
 
సినీ పరిశ్రమలో అవకాశాలు లేక, తనకని సొంతవారు లేక, ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేకుండా శ్రీరెడ్డి పడుతున్న అవస్తలు అన్నీఇన్నీ కావు. సమాజంలో మహిళలకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో చెప్పనవసరం లేదు. అర్థనగ్నంగా రోడ్డుపై నిలబడిన శ్రీరెడ్డి లాంటి వారి గురించి ఇక అస్సలు చెప్పనవసరం లేదు. ఇప్పటికే సూటిపోటి మాటలతో శ్రీరెడ్డికి ప్రతిచోటా చేదు అనుభవమే ఎదురవుతోంది. అన్ని పక్కల నుంచి శ్రీరెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. కానీ శ్రీరెడ్డి మాత్రం భయపడకుండా ఆత్మస్తైర్యంతో ముందుకు వెళుతోంది. కొంతమంది మహిళా సంఘాలకు చెందినవారు మాత్రం ఆమెకు అండగా నిలబడుతున్నారు.