గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2017 (09:14 IST)

ఇంట్లో అద్దెకుంటూ.. గర్భవతిని చేశాడు.. క్లీనింగ్ లిక్విడ్ తాగితే.. మృతశిశువు..?

ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఆ ఇంటి ఓనర్‌ వద్ద మంచిపేరు తెచ్చుకున్నాడు. అంతే అతడి కుటుంబ సభ్యులతో బాగా కలిసిపోయాడు. ఇక ఓనర్ కూతురుని లైన్లో ప పెట్టేశాడు. అంతటితో ఆగకుండా ఇంటి ఓనర్ 16 ఏళ్ల బాలికను గర్భవతిన

ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఆ ఇంటి ఓనర్‌ వద్ద మంచిపేరు తెచ్చుకున్నాడు. అంతే అతడి కుటుంబ సభ్యులతో బాగా కలిసిపోయాడు. ఇక ఓనర్ కూతురుని లైన్లో ప పెట్టేశాడు. అంతటితో ఆగకుండా ఇంటి ఓనర్ 16 ఏళ్ల బాలికను గర్భవతిని చేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో వెలుగుచూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. విల్లుపురం జిల్లాకు చెందిన శశికుమార్ (23) చెన్నై నగరంలోని నీరుకుంద్రం ప్రాంతానికి వలస వచ్చి ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ కూలీగా పనిచేస్తున్నాడు. అద్దె ఇంటి యజమాని కూతురి(16)తో ఏడాది కాలంగా సన్నిహితంగా వున్న శశికుమార్ ఆమెను లోబరుచుకుని గర్భం చేశాడు. కూతురు గర్భం దాల్చడం చూసిన తల్లిదండ్రులు కూతుర్ని నిలదీశారు. దీంతో ఆవేదన చెందిన అమ్మాయి క్లీనింగ్ లిక్విడ్ తాగేసింది. 
 
బాధితురాలిని చెన్నై ఎగ్మోర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ మృతశిశువుకు జన్మనిచ్చింది. ఇంట్లో శశికుమార్ అద్దెకు ఉంటూ ఏడాదికాలంగా తన కూతురిపై అత్యాచారం చేసి గర్భవతిని చేశాడని బాధితురాలు చెప్పడంతో.. ఆమె తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన శశికుమార్‌ను అరెస్టు చేశారు.