1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Sri reddy fires on pawan kalyan again

పవన్‌పై శ్రీరెడ్డి ఫైర్.. రౌడీ రాజకీయాలు చేస్తుంది ఎవరో తెలియదా..?

Sri reddy
వివాదాస్పద నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ప్రకంపనలు సృష్టించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలందరి పైన తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేసింది. ఇక తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి
 
పవన్ కళ్యాణ్ ఈరోజు వచ్చి ఆఫీసుపై దాడి చేయడం తప్పు అని అంటున్నాడు. ప్రజాస్వామ్యంలో ఇది సరికాదని అంటున్నాడు. అసలు ఇది మొదలు పెట్టిన దద్దమ్మ, సన్నాసి నువ్వు. నిన్ను చూసే వీడు రెచ్చిపోతున్నాడు. ఇలాంటి దరిద్రపు రాజకీయాలు మొదలు పెట్టింది నువ్వు. సినిమా ఆడియో ఫంక్షన్‌ను కూడా పొలిటికల్ ప్రెస్ మీట్‌గా మార్చుకున్నావు.
 
ముఖ్యమంత్రి జగన్‌పై బురదజల్లడమే లక్ష్యంగా ఏ బొక్క దొరికితే ఆ బొక్కలోకి వెళ్లి మరి జగన్‌పై నిందలు వేయడం పనిగా పెట్టుకున్నారు. రౌడీ రాజకీయాలు చేస్తుంది ఎవరో తెలియదా అంటూ కామెంట్ చేసింది, శ్రీ రెడ్డి వ్యాఖ్యలపై పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు మండిపడుతున్నారు.
తర్వాతి కథనం
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ టీమ్ అని అభినందించిన నాగార్జున‌