ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 21 అక్టోబరు 2021 (15:57 IST)

యాక్ష‌న్ స‌న్నివేశాల్లో భీమ్లా నాయక్

Pavan kalyan- Rana
పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా `భీమ్లా నాయక్. రానాదగ్గుబాటి కీల‌క‌పాత్ర పోషిస్తున్నాడు. మ‌లయాళ `అయ్య‌ప్ప‌మ్ కోషియ‌న్‌`కు రీమేక్‌. సిన్సియ‌ర్ పోలీసు అధికారికి, ఊరిని శాసించే ఓ వ్య‌క్తి కొడుక్కి మ‌ధ్య జ‌రిగే కథే ఇది. ఇద్ద‌రు ఇగోలు క‌లిగిన వ్య‌క్తుల క‌థ ఏవిధంగా త‌యారైంద‌నేది సినిమా. ఇందులో పోలీసు అధికారిగా ప‌వ‌న్ క‌ళ్యాన్ న‌టిస్తుండ‌గా, ఆస్తిప‌రుడి కుటుంబీకునిగా రానా న‌టిస్తున్నాడు. వీరిద్ద‌రిపై యాక్ష‌న్ స‌న్నివేశాలను చిత్రీక‌రిస్తున్న‌ట్లు గురువారంనాడు విడుద‌ల చేసిన ఫొటోల‌ను బ‌ట్టి తెలుస్తోంది.
 
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీ‌నివాస్ అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై  నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాలో బ‌య‌ట‌కు వచ్చిన జాన‌ప‌దీ గీతం ప్ర‌జాద‌ర‌ణ పొందింది. త్వ‌ర‌లో ఈ సినిమా గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి. 
 
ఇంకా ఈ సినిమాలో నిత్య మీనన్, మురళీశర్మ, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, పమ్మి సాయి తదితరులు పాల్గొనగా కీలక సన్నివేశాలు,పోరాట దృశ్యాల చిత్రీకరణ గత కొన్ని రోజులుగా  హైదరాబాద్ లో జరుగుతోంది. తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అని  తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి.  ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC,  సంగీతం: తమన్.ఎస్, ఎడిటర్:‘నవీన్ నూలి.