శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 6 జులై 2018 (12:13 IST)

పాపా... ఎక్కడైనా కలుసుకుందామా? శ్రీరెడ్డితో బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ సామ్రాట్‌

శ్రీరెడ్డి మరో బాంబు పేల్చింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ సామ్రాట్ తనతో జరిపిన సంభాషణను లీక్ చేసింది. వాట్సాప్‌లో సామ్రాట్ ఏమేమి సందేశాలు పోస్టు చేశాడో వెల్లడించింది. ఓ స్క్రీన్ షాట్ తీసి మరీ షేర్ చేసింది. అతడు ఎప్పుడైతే బిగ్ బాస్ ఇంటి నుంచి బయటక వస్తాడో

శ్రీరెడ్డి మరో బాంబు పేల్చింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ సామ్రాట్ తనతో జరిపిన సంభాషణను లీక్ చేసింది. వాట్సాప్‌లో సామ్రాట్ ఏమేమి సందేశాలు పోస్టు చేశాడో వెల్లడించింది. ఓ స్క్రీన్ షాట్ తీసి మరీ షేర్ చేసింది. అతడు ఎప్పుడైతే బిగ్ బాస్ ఇంటి నుంచి బయటక వస్తాడో ఆ వెంటనే అతడికి చెప్పులు, చీపుర్లతో స్వాగతం పలుకుతామంటూ ఫేస్ బుక్కులో పోస్ట్ చేసింది.
 
ఇప్పటికే రానా సోదరుడు అభిరామ్ తనతో సన్నిహితంగా వున్నాడంటూ ఫోటోలను లీక్ చేసిన శ్రీరెడ్డి తాజాగా సామ్రాట్‌తో చేసిన చాటింగ్ లీక్ చేసింది. ఇంతకుముందు నాని పైన కూడా అలాగే విరుచుకుపడింది. బిగ్ బాస్ హోస్ట్ నాని వల్లే తనకు బిగ్ బాస్ 2లో అవకాశం రాలేదని ఆరోపించింది. తనను వాడుకున్నాడంటూ సంచలన ఆరోపణలు చేయడంతో ఆమెకు నాని లీగల్ నోటీసులు పంపిన సంగతి విదితమే.