శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By TJ
Last Modified: శనివారం, 30 జూన్ 2018 (19:38 IST)

ఆ విషయంలో జూనియర్ బెస్ట్... నాని వేస్ట్: శ్రీరెడ్డి

బిగ్ బాస్-1 చూడటానికి ఎంతో బాగుంది. జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి అస్సలు చెప్పనవసరం లేదు. బిగ్ బాస్-2 ఈ షో గురించి నేను చెప్పలేను. నాని అస్సలు ఆ షోకు సరిపోడు. ఆ షో మొత్తం సర్వనాశమైపోయింది. డైలాగ్‌లు చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్‌కే సొంతం. ఎన్టీఆర్ డైలాగ

బిగ్ బాస్-1 చూడటానికి ఎంతో బాగుంది. జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి అస్సలు చెప్పనవసరం లేదు. బిగ్ బాస్-2 ఈ షో గురించి నేను చెప్పలేను. నాని అస్సలు ఆ షోకు సరిపోడు. ఆ షో మొత్తం సర్వనాశమైపోయింది. డైలాగ్‌లు చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్‌కే సొంతం. ఎన్టీఆర్ డైలాగ్‌లు చెబుతుంటే చప్పట్ల మీద చప్పట్లు... వినడానికి ఎంతో ఆనందం అనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఏవిధంగా అయితే ఉంటారో తన సహచర నటులతో కూడా జూనియర్ అలాగే ఉంటారు.
 
తనకు పిల్లలు పుట్టినప్పుడు, తన భార్యతో కలిసి ఫోటోలు తీసుకున్నప్పుడు ఇలా జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేసిన సందేశాలు చూస్తే ఆయన ఎంతటి గొప్పవాడో అర్థమవుతుంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ప్రతి విషయంలోను బెస్ట్ అని అంటాను నేను అంటోంది శ్రీరెడ్డి. కానీ బిగ్ బాస్ -2లో నానిని చూస్తే జనం టీవీలు కట్టేస్తున్నారు. అస్సలు నాని ఆ క్యారెక్టర్‌కు సరిపోడు. 
 
ఇది నేను అన్న మాట కాదు. ప్రజల నుంచి వస్తున్న మాట అంటూ మరోసారి నానిని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ -2 ఎలాగో నాశనమైపోయింది.. కనీసం బిగ్ బాస్-3 అన్నా బాగా వచ్చేటట్లు చేయండి అంటూ సలహా ఇచ్చింది శ్రీరెడ్డి. గ్యాప్ ఇచ్చి మరీ నానిపై మరోసారి శ్రీరెడ్డి విమర్శలు చేయడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.