గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 28 జూన్ 2018 (10:15 IST)

బిగ్ బాస్ సీజన్-2: నెక్ట్స్ ఎలిమినేషన్.. బాబు గోగినేని.. అర్చన జోస్యం

16 మంది సెలబ్రిటీలు.. 100 రోజులు.. ఇంకాస్త మసాలా.. ఏదైనా జరగొచ్చు.. అంటూ జూన్ 10 ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 2 సక్సెస్‌ఫుల్‌గా జరుగుతోంది. ఈ షోలో ఇప్పటికే మొదటి వారంలో ఎలిమినేషన్ సంజన కాగా, రెండో వారంల

16 మంది సెలబ్రిటీలు.. 100 రోజులు.. ఇంకాస్త మసాలా.. ఏదైనా జరగొచ్చు.. అంటూ జూన్ 10 ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 2 సక్సెస్‌ఫుల్‌గా జరుగుతోంది. ఈ షోలో ఇప్పటికే మొదటి వారంలో ఎలిమినేషన్ సంజన కాగా, రెండో వారంలో ఎలిమినేషన్ నూతన్ నాయుడు అయ్యాడు. ఎలిమినేషన్ అయిన వీరిద్దరూ కూడా సామాన్యులే. 
 
అయితే బిగ్ బాస్ యాజమాన్యం నూతన్ నాయుడుకి మంచి అవకాశం ఇచ్చింది. అది ఏమిటంటే… బిగ్ బాస్ సీజన్-3కి నూతన్ నాయుడు సలహాలు, సూచనలు తీసుకుంటూ దానిలో భాగం చేస్తానని మాట ఇచ్చారట. అలాగే నూతన్ నాయుడు కూడా సెలక్షన్ నుంచి మీకు అందుబాటులో ఉంది సాయం చేస్తానని చెప్పారట.
 
ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్-2లో ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ ఎలిమినేషన్ రౌండ్‌లో ఎవరు నిష్క్రమించబోతున్నారనే విషయాన్ని సినీ నటి అర్చన తెలిపింది. హేతువాది బాబు గోగినేని నిష్క్రమిస్తారని జోస్యం చెప్పింది. మరో ఐదుగురు కూడా క్యూలో ఉన్నారని... వారి పేర్లను బయటపెట్టలేనని తెలిపింది.
 
హోస్ట్‌గా నాని పర్ఫామెన్స్ బాగుందని చెప్పింది. అయితే, తారక్ గొప్పగా చేశాడని చెప్పడంలో అతిశయోక్తి లేదని తెలిపింది. బిగ్ బాస్ హౌస్ ‌లో తనకు ఇష్టమైనవారు ఉన్నారని.... వాళ్లను సేవ్ చేయడానికి చివర్లో వారి పేర్లను బయటపెడతానని చెప్పింది.