శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 29 జూన్ 2018 (12:50 IST)

బిగ్ బాస్‌లో సందడే సందడి : గీతా మాధురి పాట.. భాను, తేజ‌స్వీల స్టెప్పులు

నేచురల్ స్టార్ నాని ప్రధాన వ్యాఖ్యాతగా ప్రముఖ టీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోలో సందడి వాతావరణం నెలకొంది. ఇది ఇప్పటికే 19 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తాజాగా ఎపిసోడ్‌లో తేజ‌స్వీ, యాంక‌ర్ శ్య

నేచురల్ స్టార్ నాని ప్రధాన వ్యాఖ్యాతగా ప్రముఖ టీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షోలో సందడి వాతావరణం నెలకొంది. ఇది ఇప్పటికే 19 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తాజాగా ఎపిసోడ్‌లో తేజ‌స్వీ, యాంక‌ర్ శ్యామ‌ల మ‌ధ్య చిన్నపాటి పొర‌ప‌చ్చాలు వచ్చాయి.
 
అలాగే, నేపథ్యగాయని గీతా మాధురి పాట‌కి తేజూ, భానులు అదిరిపోయే స్టెప్స్ వేయ‌డం, ఇక ఇంటి స‌భ్యులు రెగ్యుల‌ర్ మెనూ గురించి డిస్క‌ష‌న్స్ త‌దిత‌ర అంశాల‌తో పాటు బిగ్‌బాంబ్‌ని స్వీక‌రించిన కౌశ‌ల్‌ వంట ప్లేట్స్‌ని క‌డ‌గ‌డం, బిగ్ బాస్ హౌజ్ అద్దం ప‌గుల‌గొట్టిన కార‌ణంగా శిక్ష‌ని స్వీక‌రించిన సామ్రాట్ పెద్ద‌రాయిని చిన్న చిన్న రాళ్ళుగా ప‌గ‌ల‌గొట్ట‌డం వంటి అంశాలు చోటు చేసుకున్నాయి. అయితే గురువారం నాటి ఐపిసోడ్‌లో తేజూ, భాను వేసిన స్టెప్స్ హైలైట్ అని అంటున్నారు. 
 
ఇకపోతే, ఇక కొన్నాళ్ళుగా బిగ్ బాస్ హౌజ్‌లో సామ్రాట్‌, తేజ‌స్వినిలని గ‌మ‌నిస్తున్న నందిని వారి మ‌ధ్య ఉన్న మేట‌ర్ ఏంటో తెలుసుకోవాలని ప్ర‌య‌త్నించింది. ఈ క్ర‌మంలో తేజ‌స్వీతో గుస‌గుస‌లాడింది. 'నేను హౌస్‌కి వచ్చినప్పటి నుండి గమనిస్తున్నా.. మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని మీ ప్రవర్తనను చూస్తే అర్ధమౌతోంది.. ఇది నాకే కాదు బయట షో చూస్తున్న వాళ్లందరికీ ఇదే సందేహం వస్తోందని చెప్పింది. 
 
ఇక ఇంటి స‌భ్యులు అంద‌రు ఒక్కొక్క‌రిగా త‌మ జీవితంలోని కొన్ని అనుభ‌వాల‌ని వివ‌రిస్తూ, ప్రేమ‌ని మిస్ అయిన‌వారికి రోజా పువ్వులు ఇచ్చారు. ఆ టాస్క్ పూర్తి అయిన త‌ర్వాత యాంక‌ర్ దీప్తి కాస్త ఎమోష‌న‌ల్ అయింది. త‌న ఫ్యామిలీని మిస్ అవుతున్న కార‌ణంగా వెక్కి వెక్కి ఏడ్చింది. ఈ క్ర‌మంలో తేజ‌స్వీ, గీతా మాధురి, సామ్రాట్ త‌దిత‌రులు దీప్తిని ఓదార్చారు. ఇక చివ‌రిలో గీతా మాధురి.. గ‌ణేష్‌కి చిన్నపాటి క్లాస్ తీసుకుంది. దీంతో 19వ అంకం ముగిసిపోయింది.