శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 14 జూన్ 2018 (17:05 IST)

డైరెక్టర్ నాకు అది కావాలన్నాడట... బిగ్ బాస్ తెలుగు 2 సంజన షాకింగ్

క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ రచ్చై రొచ్చుగా మారింది. ఇప్పటికే నటి శ్రీరెడ్డి పలువురు నటులు, దర్శకుల పేర్లు చెప్పి వాళ్లను వణికిస్తానంటూ హెచ్చరికలు చేస్తోంది. మరోవైపు ఆమెకు కౌంటర్ వేసేస్తున్నారు. ఇదిలావుంటే ఇటీవలే ప్రారంభమైన బి

క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ రచ్చై రొచ్చుగా మారింది. ఇప్పటికే నటి శ్రీరెడ్డి పలువురు నటులు, దర్శకుల పేర్లు చెప్పి వాళ్లను వణికిస్తానంటూ హెచ్చరికలు చేస్తోంది. మరోవైపు ఆమెకు కౌంటర్ వేసేస్తున్నారు. ఇదిలావుంటే ఇటీవలే ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 2లో కామన్ పీపుల్ క్యాటగిరీలో విజయవాడకు చెందిన సంజన అనే మోడల్ కూడా ప్రవేశించారు. ఇప్పుడు ఈమెకు సంబంధంచి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.
 
బిగ్ బాస్ 2కి సెలెక్ట్ అవక ముందు సంజన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆమె సంచలన విషయాలు బయటపెట్టారు. తనను టాలీవుడ్ డైరెక్టర్ ఒకరు కమిట్మెంట్ ఇవ్వాలని కోరారనీ, ఆ మాట అన్నందుకు అతడి చెంప ఛెళ్లుమనిపించినట్లు చెప్పుకొచ్చారు. తనతో ఒప్పుకుంటే ముంబైలో ప్లాటు, కావల్సినంత రెమ్యునరేషన్ ఇప్పిస్తానని తన మేనేజర్ చేత చెప్పించేసరికి కోపం పట్టలేక నేరుగా అతడి వద్దకెళ్లి చెంపలు వాయించేసినట్లు వెల్లడించింది. తనకు చేతనైతే నటిస్తాను, లేదంటే ఇంటికి తిరిగి వెళ్తాను అని చెప్పినట్లు తెలిపింది. 
 
మిస్ ఇండియా ఫైనల్ లిస్టులో చోటు సాధించిన సంజన, బిగ్ బాస్ తెలుగు 2లో ప్రవేశించింది. ఆమె ఎవరా అని చర్చించుకునే క్రమంలో ఈ విషయాలన్నీ వెలుగుచూస్తున్నాయి. కాగా తనను కమిట్మెంట్ అడిగిన దర్శకుడు ఎవరన్నది మాత్రం ఆమె వెల్లడించలేదు.