బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: గురువారం, 5 జులై 2018 (10:38 IST)

బిగ్ బాసా... లవ్ బాసా? అతుక్కుపోయి చంపేస్తున్న సామ్రాట్-తేజస్వి

100 ఎపిసోడ్ల బిగ్ బాస్ 2 తెలుగు మంగళవారం నాటికి 25 ఎపిసోడ్లు పూర్తిచేసుకుంది. చూసేవారికి కాస్త హీటెక్కించి ఏదోవిధంగా కిక్ తెప్పించేందుకు బిగ్ బాస్ నానా తంటాలు పడుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే 24వ ఎపిసోడ్ చూస్తే బిగ్ బాస్ ఇంటిని హాస్టలుగా మార్చేశాడ

100 ఎపిసోడ్ల బిగ్ బాస్ 2 తెలుగు మంగళవారం నాటికి 25 ఎపిసోడ్లు పూర్తిచేసుకుంది. చూసేవారికి కాస్త హీటెక్కించి ఏదోవిధంగా కిక్ తెప్పించేందుకు బిగ్ బాస్ నానా తంటాలు పడుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే 24వ ఎపిసోడ్ చూస్తే బిగ్ బాస్ ఇంటిని హాస్టలుగా మార్చేశాడు బిగ్ బాస్. అందులో అమ్మాయిలతో అబ్బాయిలను ఐదు ప్రేమ జంటలు మార్చాడు. 
 
అంతేకాదు... ఈ ప్రేమ జంటలు కలుసుకోకుండా వుండేందుకు సెక్యూరిటిగా ఇద్దరిని నియమించాడు. హాస్టల్లో సామ్రాట్-తేజస్వి, అమిత్-భాను, రోల్ రైడా-దీప్తి సునైనా, కౌశల్-దీప్తిలు జంటలు. వారికి సెక్యూరిటీకి శ్యామల, గణేషులను నియమించారు. వార్డెన్లు గోగినేని బాబు, గీతా మాధురి. ఐతే ఈ జంటల ప్రేమాయణంలో తేజస్వి-సామ్రాట్ వ్యవహారం నషాలానికి ఎక్కించేసింది. 
 
విషయం ఏమిటంటే... ఎప్పుడు కెమేరాలో కనబడినా సామ్రాట్-తేజస్వి ఒకరికొకరు బిగి కౌగిలిలో ఇరుక్కుపోయి అతుక్కుని కనబడుతున్నారు. వీరి హాట్ రొమాన్సును చూసి బిగ్ బాస్ ఏమనుకుంటున్నాడో కానీ చూసే జనం మాత్రం ఇంట్లో పిల్లకాయలున్నారని బెంబేలెత్తిపోతున్నారట. మరి ఈ టాస్క్ చివరికి ఎలాంటి మలుపు తిరుగుతుందో? సామ్రాట్-తేజస్వి లవ్ ఎంతవరకు వెళుతుందో బిగ్ బాస్‌తో పాటు మనమూ చూద్దాం.