1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Tamil co-actress involved in prostitute case

వ్యభిచారం చేస్తున్న తమిళ నటి... పోలీసులకు పట్టించిన ప్రజలు

ఓ తమిళ నటి వ్యభిచారం కేసులో పట్టుబడింది. పర్యాటక అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులతో వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కింది. ఆ నటిని స్థానిక ప్రజలే పోలీసులకు పట్టించి ఇవ్వడం గమనార్హం. ఈ వివరాలను పరి

prostitute case
ఓ తమిళ నటి వ్యభిచారం కేసులో పట్టుబడింది. పర్యాటక అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులతో వ్యభిచారం చేస్తూ పోలీసులకు చిక్కింది. ఆ నటిని స్థానిక ప్రజలే పోలీసులకు పట్టించి ఇవ్వడం గమనార్హం. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తమిళనాడు రాష్ట్రంలోని పర్యాటకులు అత్యధికంగా సంచరించే ప్రాంతం కన్యాకుమారి. ఈ జిల్లా కేంద్రంలోని కులశేఖర ప్రాంతంలోని లాడ్జీల్లో వ్యభిచారం నిరంతరాయంగా జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వాటిపై నిఘా వేశారు. 
 
తమిళనాడుతో పాటు కర్ణాటక, ఏపీ, కేరళ ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చి వెళ్లే ఈ ప్రాంతానికి ఓ మహిళ, మరో ముగ్గురు యువతులతో వచ్చి అనుమానాస్పదంగా తిరుగుతుంటే, స్థానికులకు వారు వ్యభిచారం నిమిత్తమే వచ్చారన్న అనుమానం కలిగింది. దీంతో వారిపై కన్నేశారు. 
 
వీరిలో ఓ యువతిని లాడ్జిలో దింపి వచ్చిన మహిళ, మిగిలిన ఇద్దరితో ఓ చెట్టుకింద కూర్చుంది. ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వారందరినీ అరెస్టు చేశారు. ఈమె కోలీవుడ్ చిత్రాల్లో సహాయ నటిగా చేస్తున్నట్టు తేలింది. 
 
దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనతో పాటు ఇద్దరు అమ్మాయిలు కూడా చెన్నై నుంచి వచ్చామని ఆమె వాగ్మూలం ఇచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు హోటల్ యజమానిని అరెస్ట్ చేసి, పారిపోయిన వారి కోసం గాలిస్తున్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
'రంగస్థలం' మూవీ రివ్యూ ... సుక్కు 'మార్కు'కి చెర్రీ 'లెక్క'కి సరిపోయింది...