థియేటర్స్‌లోనే విడుదల అంటోన్న టక్ జగదీష్
Talk Jagadeesh
కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం విడుదల తాత్కాలికంగా వాయిదా పడింది. అయితే టక్ జగదీష్ చిత్రం ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని చిత్రయూనిట్ తెలిపింది. టక్ జగదీష్ చిత్రం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల కానుందనే వార్తలు పూర్తిగా అవాస్తవం. పుకార్లను నమ్మవద్దు. టక్ జగదీష్ పూర్తిగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం రూపొందించబడిన మంచి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత టక్ జగదీష్ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటనను వెల్లడిస్తాం. దయచేసి అందరు జాగ్రత్తగా ఉండండి. కోవిడ్ జాగ్రత్తలను పాటించండి అని చిత్రయూనిట్ పేర్కొంది.

