శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 మే 2021 (10:07 IST)

త్రిశూలం పట్టుకుని కాళీమాత అవతారంలో సాయిపల్లవి!

Saipallavi
నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ ఎస్‌. బోయనపల్లి నిర్మిస్తున్నారు.
 
ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. నిన్న హీరోయిన్ సాయి పల్లవి బర్త్ డేను పురస్కరించుకుని ఆమె లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇందులో ఆమె త్రిశూలం పట్టుకుని కాళీమాత అవతారంలో దర్శనమిస్తోంది. ఈ పోస్టర్‌కి సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తుంది.