గురువారం, 7 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (18:42 IST)

ఆరున్న‌ర కోట్ల భారీ సెట్లో `శ్యామ్ సింగ‌రాయ్`‌

Nani Sayam
నాని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘శ్యామ్‌ సింగ రాయ్‌’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ ఆడియన్స్‌లో సినిమా పట్ల మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తూ అటు ఇండస్ట్రీలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ అంచనాలను భారీగా పెంచేసింది.
 
తాజాగా ఈ సినిమా కోసం ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాష్‌ కొల్ల, కోల్‌కతాను త‌ల‌పించే భారీ సెట్‌ను హైదరాబాద్‌లో రీ క్రియేట్‌ చేశారు. ఆరున్నర కోట్ల భారీ బడ్జెట్‌తో ప‌ది ఎక‌రాల్లో నిర్మించిన ఈ భారీ సెట్‌లో ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతోంది. హీరో నాని స‌హా ముఖ్యతారాగణంపై ప‌లు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రేపు థియేట‌ర్‌ల‌లో ఈ స‌న్నివేశాలు సినీ ప్రియుల‌కి ఒక కొత్త అనుభూతిని పంచ‌నున్నాయ‌ని చిత్ర యూనిట్ తెలిపింది.
 
ద‌ర్శ‌కుడు రాహుల్‌ సంకృత్యాన్‌ ఓ యూనిక్‌ కాన్సెప్ట్‌తో ‘శ్యామ్‌సింగ రాయ్‌’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో త‌న గ‌త చిత్రాల‌కు భిన్న‌మైన స‌రికొత్త గెట‌ప్స్‌ల‌లో నాని క‌నిపించ‌నున్నారు.
 
సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని 
ప్ర‌తిభావంతులైన సాంకేతిక నిపుణులతో ఎక్కడ రాజీ పడకుండా నిర్మాత వెంకట్‌ బోయనపల్లి రూపొందిస్తున్నారు. 
ఈ ప్రాజెక్ట్ తో  అసోసియేట్‌ అయిన ప్ర‌తి ఒక్క‌రికీ  ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ ఓ స్పెషల్‌ ఫిల్మ్‌గా ఉండబోతుంది.
 
జీస్సూసేన్‌ గుప్తా, రాహుల్‌ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్‌ గోమఠం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. 
 
నిహారిక ఎంటర్‌టైన్మెంట్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సత్యదేవ్‌ జంగా కథ అందించారు. మెలోడీ స్పెషలిస్ట్‌ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ నవీన్‌ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్‌చేస్తున్నారు.
 
సాంకేతిక నిపుణులు
డైరెక్టర్‌: రాహుల్‌ సంకృత్యాన్‌
నిర్మాత: వెంకట్‌ బోయనపల్లి
బ్యానర్‌: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌
ఒరిజినల్‌ స్టోరీ: సత్యదేవ్‌ జంగా
మ్యూజిక్‌ డైరెక్టర్‌ : మిక్కీ జే మేయర్‌
సినిమాటోగ్రఫీ: స‌ను జాన్‌ వర్గీస్‌
ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్ల
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌ .వెంకటరత్నం (వెంకట్‌)
ఎడిటర్‌: నవీన్‌నూలి
పీఆర్ఒ:వంశీ –శేఖర్