సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (12:49 IST)

మంత్రి పేర్ని నానికి అర్జెంటుగా 'రాబిస్' వ్యాక్సిన్ వేయండి.. నాగబాబు ఫైర్

జసనేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్. ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా, విడుదలైన తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూకడుతున్నారు. 
 
దీంతో 'వకీల్ సాబ్' సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అన్ని వర్గాల సినీ అభిమానులను ఆకట్టుకున్న ఈ చిత్రం మంచి రేటింగ్ సాధించింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి మొదలైన వివాదం రోజుకో మలుపు తిరుగుతూ చర్చనీయాంశంగా మారింది.
 
ఈ సినిమా బెనెఫిట్ షోలు, ఎక్స్ ట్రా షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతిని నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో, పవన్ కల్యాణ్‌కు భయపడే స్పెషల్ షోలకు జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఏపీ బీజేపీ ఇన్ఛార్జి సునీల్ దేవధర్ విమర్శించారు. 
 
ఈ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ... 'మీకు దురద ఉందని తెల్లవారుజామున 5 గంటలకే వెళ్తే షో వేయరు సునీల్ గారూ' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. పేర్ని నానిపై పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ, 'మీకు ఏమి అయ్యింది నాని గారు. మీరు కరోనా వాక్సిన్‌తో పాటు రేబిస్ వాక్సిన్ కూడా వేసుకోవాలి. ఇట్స్ అర్జంట్. ప్లీజ్ సెండ్ రేబిస్ వాక్సిన్ టు మిస్టర్ నాని, స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్. వాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పేరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ' అని వ్యాఖ్యానించారు. కుక్క కరిచిన వారికి రేబిస్ ఇంజెక్షన్లు వేస్తారనే విషయం తెలిసిందే. ఇపుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని రేపుతాయో చూద్ధాం.