గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 ఏప్రియల్ 2021 (12:49 IST)

ఆదడంటే.. వాడి బాత్రూంలో ఉండే బొమ్మకాదు.. 'వకీల్ సాబ్' ప్రమోలు రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం "వకీల్ సాబ్". ఈ చిత్రం ఈ నల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం తొలి ఆట నుంచి బాక్సాఫీసులను షేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అలా, థియేటర్లలో 'వకీల్ సాబ్' రచ్చరచ్చ చేస్తున్నాడు. మ‌రో వైపు ఈ చిత్రానికి సంబంధించి ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌ను ప్రోమోల రూపంలో విడుద‌ల చేస్తూ మేక‌ర్స్ మూవీపై భారీ అంచ‌నాలు పెంచుతున్నారు. 
 
తాజాగా సూప‌ర్ ఉమెన్ అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన మైండ్ బ్లోయింగ్ ప‌ర్‌ఫార్మెన్స్ వీడియో ఒక‌టి విడుద‌ల చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ట‌న్నింగ్ ప‌ర్‌ఫార్మెన్స్ ప్రేక్ష‌కుల‌కు అమిత‌మైన వినోదాన్ని అందిస్తుంది. అలాగే, విలన్ ప్రకాష్ రాజ్‌తో కోర్టులో జరిగే ఓ సన్నివేశం ప్రమో, పవన్ కోర్టులో ఆవేశంగా వాదించే ఓ సన్నివేశం ప్రమోను కూడా రీలిజ్ చేశారు. ఇందులో పవన్ ఆవేశంతో వాదిస్తూ.. "ఆడదంటే... వాడి బాత్రూమ్‌లో కనిపించే బొమ్మకాదు.. వాడిని కనిపెంచిన అమ్మ కూడా" అంటూ వాదించే సన్నివేశం కూడా ఉంది. 
 
కాగా, 'వ‌కీల్ సాబ్' చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా, ఇందులో నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ముఖ్య పాత్ర‌లు పోషించారు. శృతిహాస‌న్ కీల‌క పాత్ర పోషించింది. ఏప్రిల్ 9న విడుద‌లైన ఈ చిత్రం రికార్డ్ క‌లెక్ష‌న్స్ రాబ‌డుతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. దిల్ రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప‌లు రికార్డులు బ్రేక్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.