బుధవారం, 29 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 27 మే 2021 (16:52 IST)

కరోనా రోగుల కోసం లింగుస్వామి ఆశ్రమం

Udayanidi stali, linguswami
దర్శకుడు లింగుసామి తమిళ సినీ పరిశ్రమలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు, ఆర్‌బి చౌదరి నిర్మించిన మమ్ముట్టి `ఆనందం` చిత్రంతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. మురళి, అబ్బాస్, దేవయాని, రంభ నటించిన ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకుంది.  ఆయ‌న రూపొందించిన `సందకోళి` తెలుగులో `పందెంకోడి`గా వ‌చ్చి సక్సెస్ సాధించింది. తాజాగా రామ్‌తో తెలుగు, త‌మిళ భాషా చిత్రాన్ని త్వ‌ర‌లో సెట్‌పైకి తీసుకెళ్ళ‌నున్నారు.
 
karona asramam
ఇదిలా వుండ‌గా, త‌న 20 ఏళ్ళ కెరీర్‌ను గుర్తుచేసుకుంటూ, ప్ర‌స్తుతం క‌రోనా రోగుల కోసం ఏదైనా చేయాల‌ని త‌ల‌చారు. రెండు రోజుల క్రితం దర్శకుడు లింగుసామి మనపాక్కం ఆశ్రమంలో కరోనా రోగుల కోసం 50 పడకలను సిపాకా సహకారంతో ఏర్పాటు చేయడానికి చొరవ తీసుకున్నారు. నటుడు, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ తో పాటు, ఆ రాష్ట్ర గ్రామీణ మంత్రి అన్బరసన్, కీర్తి సురేష్ బుధ‌వారంనాడు ఆ కేంద్రాన్ని ప్రారంభించారు. వైరస్‌తో పోరాడుతున్న వారి చికిత్సకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని లింగు స్వామి పేర్కొన్నారు. ఇలాంటి కార్య‌క్ర‌మంలో భాగ‌మైనందుకు గ‌ర్వంగా వుంద‌ని ఉద‌య‌నిధి, కీర్తి సురేష్ తెలిపారు.