1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Upasana Mega Wishes for Nara Devansh

దేవాన్ష్‌కు ఉపాసన పుట్టినరోజు విషెస్.. ఫోటో అదిరింది..

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాజాగా ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉపాసన షేర్ చేసిన ఫోటోలో ఏపీ

Upasana
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాజాగా ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉపాసన షేర్ చేసిన ఫోటోలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కోడలు బ్రాహ్మణి, విలక్షణ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మితో పాటు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సతీమణి నమ్రత కూడా వున్నాడు. 
 
వీరితో ఉపసాన కూడా కనిపించారు. ఈ ఫోటోకు నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు. కామెంట్లు సైతం వెల్లువెత్తుతున్నాయి. లోకేశ్-బ్రాహ్మణి కుమారుడు దేవాన్ష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఉపాసన ఈ ఫొటోని పోస్ట్ చేసింది. 
 
మరోవైపు రాంచరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో మిస్టర్ సితో కలిసి క్యూట్ ఫోటోని కూడా షేర్ చేసారు. ఈ ఫోటోలో చిట్టి బాబు లుక్‌లో ఉన్న చరణ్, ఉపాసనతో వెరైటీ స్టైల్‌లో నిలబడి ఉన్నాడు. రంగస్థలం చిత్రం మార్చి 30న విడుదల కాబోతున్న విషయాన్ని ఈ ఫోటో ద్వారా ఉపాసన తెలియజేసింది. ఈ ఫోటోకు కూడా లైక్స్ అదిరిపోతున్నాయి. 
About Writer
selvi
తర్వాతి కథనం
''సైరా''కు సంగీత దర్శకుడిగా అమిత్ త్రివేదిని తీసుకున్నారా?