బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (18:40 IST)

హీరో అఖిల్ మాజీ ప్రియురాలికి రాంచరణ్ భార్య బంధువుతో వివాహం?

శ్రియా భూపాల్. జీవీకే గ్రూపు సంస్థల అధిపతికి మనుమరాలు. యువ డిజైనర్. ఈమె సీనియర్ హీరో అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేనితో ప్రేమలో పడింది.

శ్రియా భూపాల్. జీవీకే గ్రూపు సంస్థల అధిపతికి మనుమరాలు. యువ డిజైనర్. ఈమె సీనియర్ హీరో అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేనితో ప్రేమలో పడింది. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి ఇరు కుటుంబాల పెద్దలు కూడా సమ్మతించి ఇద్దరీ పెళ్లి నిశ్చితార్థం కూడా చేశారు. 
 
ఆ తర్వాత వీరిద్దరి వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో ఇటలీలో జరగనుందనే ప్రచారం జరిగింది. అందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. కానీ ఏం జరిగిందో ఏమోగానీ ఆఖరి నిమిషంలో వీరిద్దరి పెళ్లి రద్దు అయింది. ఈ పెళ్లి రద్దుపై అఖిల్ కుటుంబ సభ్యులు కానీ, ఇటు శ్రియ ఫ్యామిలీ కానీ స్పందించలేదు.
 
ఈనేపథ్యంలో శ్రియ భూపాల్ ఓ ఎన్నారై వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్దమైందట. అఖిల్‌తో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత శ్రియ కుటుంబ సభ్యులు ఎన్నారై సంబంధం చూసారని, ఆ వ్యక్తిని చేసుకునేందుకు శ్రియ కూడా సిద్దంగా ఉందని సమాచారం. మరి ఆ వ్యక్తి మరెవరో కాదు హీరో రాం చరణ్ సతీమణి ఉపాసన కజిన్ అనిన్ దిత్ అని తెలుస్తుంది. వీలైనంత త్వరలోనే శ్రియ భూపాల్ పెళ్లి కుమార్తెగా మారనుంది.