ఆల్ ఇండియా మోస్ట్ డిజైరబుల్ లిస్టులో విజయ్ దేవరకొండ
Vijay Devarakonda
ఆన్ లైన్ ఓటింగ్, జ్యూరీ అభిప్రాయాల ఆధారంగా వివిధ రంగాల్లోని సెలబ్రిటీలను టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ తయారు చేసింది టైమ్స్ గ్రూప్. నేషనల్ వైడ్ గా జరిగిన ఆన్ లైన్ ఓటింగ్ లో దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తొలి స్థానం దక్కించుకోగా రెండో స్థానంలో విజయ్ దేవరకొండ నిలిచారు. ఆదిత్య రాయ్ కపూర్, వికీ కౌశల్, దుల్కర్ సల్మాన్ తొలి ఐదు స్థానాల్లో ఉన్నారు.
"అర్జున్ రెడ్డి" సినిమా హిందీ రీమేక్ "కబీర్ సింగ్" తో బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ బాగా పరిచయం అయ్యారు. ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమా "లైగర్" తో హిందీ పరిశ్రమకు విజయ్ దేవరకొండ మరింత దగ్గరవుతున్నారు. "టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 50" లిస్ట్ లో విజయ్ సెకండ్ ప్లేస్ గెల్చుకోవడానికి తన ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్ కూడా దోహదపడింది.దీనితో ఆయన చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా "లైగర్" మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

