అసెంబ్లీ రౌడీ రోజే సన్నాఫ్ ఇండియా టీజర్
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు నటిస్తున్న కొత్త చిత్రం సన్నాఫ్ ఇండియా. ఇది దేశభక్తితోపాటు సామాజిక అంశాన్ని కూడా చెబుతున్నారు. 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బేనర్‌పై మంచి విష్ణు నిర్మిస్తున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. కరోనాకు ముందే దాదపు చిత్రీకరణ మూడు వంతుల పూర్తయింది. ఇందులో మోహన్‌బాబు సరికొత్తగా కనిపించనున్నాడు. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం సమకూర్చారు.
ఇదిలా వుండగా, ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను కరోనా సెకండ్‌వేవ్‌కు ముందుగానే విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ షడెన్‌గా కరోనా ఎక్కువడంతో అంచనాలు మారిపోయాయి. అందుకే ఇప్పుడు సరైన సమయంగా భావించి టీజర్‌ను విడుదల చేస్తున్నారు. దానికి ఓ కారణం ఉంది. మోహన్‌బాబు కెరీర్‌లో ట్రెండ్ సెట్ అయిన అసెంబ్లీ రౌడీ సినిమా జూన్ 4వ తేదీకి 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా సన్నాఫ్ ఇండియా టీజర్‌ను విడుదలచేయాలని నిర్ణయించారు. అందుకే రేపు ఉదయం 12.02 నిముషాలకు హీరో సూర్య ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. దీని గురించి మరిన్ని విషయాలు రేపు తెలియనున్నాయి.