సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 మే 2021 (11:03 IST)

మంచు వారమ్మాయికి షాకిచ్చిన హ్యాకర్స్...

టాలీవుడ్ నటీమణుల్లో మంచు లక్ష్మీ ఒకరు. సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు ఏకైక కుమార్తె. అయితే, ఇపుడు ఈ మంచువారమ్మాయికి హ్యాకర్స్ తేరుకోలేని షాకిచ్చారు. ఈమె యూట్యూబ్ చానెల్‌ను హ్యాకర్స్ హ్యాక్ చేశారు. 
 
కొద్ది రోజుల క్రితం పిల్ల‌ల కోసం "చిట్టి చిల‌క‌మ్మా" అనే యూట్యూబ్ ఛానెల్‌ను స్టార్ట్ చేసింది. ఇందులో త‌న కుమార్తె విద్యా నిర్వాణ ద్వారా పిల్ల‌ల పెంప‌కం, చ‌దువు బోధించే ప‌ద్ద‌తుల గురించి వివ‌రిస్తూ వస్తోంది. 
 
ఈ క్రమంలో ఇప్పుడు త‌న యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ అయింద‌ని, దీని నుండి త‌ప్పుడు స‌మాచారం వ‌స్తే ప‌ట్టించుకోవ‌ద్ద‌ని, త‌మ టీమ్ సైట్‌ను తిరిగి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని పేర్కొంది.
 
కాగా, సెలెబ్రిటీలతో పాటు.. ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలపై హ్యాకర్స్ ఓ కన్నేసి ఉంచుతారు. ఛాన్స్ దొరికిన‌ప్పుడల్లా వారి ట్విట్ట‌ర్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ త‌ర‌చు హ్యాక్ చేస్తూ వారిని ఆందోళ‌న‌కు గురిచేస్తున్నారు. తాజాగా మంచు ల‌క్ష్మీ యూట్యూబ్ ఛానెల్‌ని హ్యాక్ చేసి షాకిచ్చారు.