విజయ్ దేవరకొండ "లైగర్" టీజర్ రిలీజ్ వాయిదా

liger
ఠాగూర్|
మే 9వ తేదీ యంగ్ సెన్సేష‌న్ విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం 'లైగ‌ర్' టీజ‌ర్ విడుద‌ల అవుతుంద‌ని అంతా భావించారు. కాని ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో మూవీ టీజ‌ర్‌ను వాయిదా వేస్తున్న‌ట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసింది.

"మే 9న లైగ‌ర్ ప‌వర్ ప్యాక్ట్ టీజ‌ర్ రిలీజ్ చేద్దామ‌ని అనుకున్నాం. కాని ఈ సంక్షోభ స‌మ‌యంలో టీజ‌ర్ విడుద‌ల చేయ‌డం క‌న్నా, వాయిదా వేయ‌డ‌మే మంచిద‌నిపించింది. చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ గ‌తంలో ఎన్న‌డు క‌నిపించ‌ని లుక్‌లో మెరవ‌నున్నాడు. త‌ప్ప‌క అభిమానుల‌ని అల‌రిస్తాడు.

ఇలాంటి ప‌రిస్థితుల‌లో బ‌య‌ట తిర‌గ‌కుండా ప్ర‌తి ఒక్క‌రు ఇంటి ప‌ట్టునే ఉండండి. త‌ప్ప‌క వ్యాక్సిన్ వేయించుకోండి. వైద్యులు చెబుతున్న సూచ‌న‌లు పాటిస్తూ అంద‌రు జాగ్ర‌త్త‌గా ఉండండి. ప‌రిస్థితులు అన్ని కుదుట‌పడ్డాక లైగర్ మిమ్మ‌ల్ని ఎంట‌ర్ టైన్ చేసేందుకు వ‌స్తాడ‌ని" ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్, పూరీ కనెక్ట్స్ ప్ర‌క‌టించాయి.

కాగా, ఈ కొత్త చిత్రంలో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం నేషనల్ లెవెల్ బాక్సర్‌గా ఇక సెకండ్ హాఫ్ మొత్తం ఇంటర్నేషనల్ హై వోల్టేజ్ బాక్సర్‌గా కనిపిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అన‌న్య పాండే క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :