`నారప్ప` వాయిదా వేశారు
వెంకటేష్ నటించిన `నారప్ప` సినిమాను కరోనా వల్ల విడుదలను వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ గురువారంనాడు ప్రకటించింది. ఇది కోలీవుడ్ చిత్రం “అసురణ్” కు రీమేక్ గా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించారు. అయితే అన్ని పనులు జరిగిపోయి సినిమా విడుదలను కూడా నిర్మాతలు వచ్చే మే లో విడుదల చేస్తున్నట్లు కరోనా సెకండ్‌వేవ్‌కు ముందు ప్రకటించారు.
కానీ పరిస్థితులు మారాయి, థియేటర్లు పెద్దగా లేవు. జనాలు అందరూ కోవిడ్‌కు భయపడి ఇళ్ళ వద్దే వుంటున్నారు. అందుకే ప్రేక్షకుల ఆరోగ్యం కారణంగా సినిమా వాయిదా వేస్తున్నామని మళ్ళీ పరిస్థితులు చక్కబడ్డాక త్వరలోనే విడుదల చేసేందుకే ప్రయత్నం చేస్తామని తెలిపారు.
అంతే కాకుండా అందరూ ఇళ్లలోనే ఉండి కలసికట్టుగా కరోనా ను అరికట్టాలని ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి దూరాన్ని పాటిస్తే అందరికీ సమాజానికి గొప్ప సాయం చేసిన వారు అవుతారని” నారప్ప యూనిట్ తెలియజేసారు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందివ్వగా కళైపులి, డి.సురేష్ బాబు నిర్మించారు.