సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (11:39 IST)

దేశంలో శుక్రవారం కాస్త తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గత రెండు రోజుల్లో కాస్త పెరుగుతూ వచ్చిన ఈ కేసుల్లో శుక్రవారం తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా1,32,364 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 
 
కొత్తగా మరో 2,07,071 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరోవైపు మరణాలు సైతం తగ్గుతున్నాయి. కొత్తగా 2,713 మంది వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌కేసుల సంఖ్య 2,85,74,350కు చేరింది.
 
ఇందులో 2,65,97,655 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు మొత్తం 3,40,702 మంది మహమ్మారి బారినపడి మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 16,35,993 యాక్టివ్‌కేసులు ఉన్నాయని చెప్పింది. 
 
ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 93.08 శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 7.27శాతంగా ఉందని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 6.38 శాతానికి పడిపోయిందని, వరుసగా 11 రోజుల్లో పది శాతానికన్నా తక్కువగా ఉందని చెప్పింది. టీకా డ్రైవ్‌లో భాగంగా 22,41,09,448 డోసులు చేసినట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ వివరించింది.