శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (18:50 IST)

గంటకు 165 మంది మృతి-మే నెలలో మరణ మృదంగం

భారత్‌లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మే నెలలో దేశంలో కరోనా మహమ్మారి మృత్యు తాండవం చేసింది. గంటకు సగటున 165 మందిని పొట్టన పెట్టుకుంది. ప్రపంచంలోని ఏ దేశంలో లేనివిధంగా..... వేల మందిని బలి తీసుకుంది. మహమ్మారి ధాటికి  రోజుకు వందల మంది అసువులు బాశారు. 
 
మే నెలలో కరోనాతో భారత్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంది. మే నెలలో రోజువారీగా నాలుగు లక్షల కేసులు దాటాయి. ప్రపంచంలో ఇప్పటివరకూ ఏ దేశంలో నమోదు కానంతగా అత్యధిక కేసులు, మృతులు మే నెలలో వెలుగు చూశాయి. మే నెలలో 33 శాతం మృతులు చోటుచేసుకున్నాయి. అలాగే 1.2 లక్షల మృతులు నమోదైనాయి. 
 
ఇక ఈ నెలలో గంటకు దాదాపు 165మంది ప్రాణాలు కోల్పోయారు. మే 19న రికార్డు స్థాయిలో 4529 మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా ఒక్కరోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇవే. ఈ ఏడాది కేవలం ఏప్రిల్, మే నెలల్లో దాదాపు ఒకటిన్నర లక్ష మృతులు నమోదైనాయి. దేశ రాజధాని ఢిల్లీలో మరణాల రేటు అధికం. 2.9 శాతం మృతుల రేటు నమోదయ్యాయి. ఢిల్లీలో మే నెలలో 8వేలకు పైగా మృతులు చోటుచేసుకున్నాయి.