సంబంధిత వార్తలు
- 'సైరా'లో ఒక్క యుద్ధ సన్నివేశానికి రూ.75 కోట్లు.. మొత్తం బడ్జెట్ ఎంత?
- మెగాస్టార్ చిరును టెన్షన్ పెడుతున్న సైరా... ఎందుకో తెలుసా?
- చెర్రీ మోసం చేశారు... మాకు న్యాయం చేసి 'సైరా'ను విడుదల చేయండి: హైకోర్టులో పిటీషన్
- మెగాస్టార్ సైరాకు యు/ఏ సర్టిఫికేట్.. విడుదలకు సిద్ధం
- వదల 'సైరా' నిన్నొదలా... చిరు, చరణ్ లపై ఉయ్యాలవాడ వారసుల ఫిర్యాదు...
సైరా వేడుకకు బన్నీ ఎందుకు రాలేదు. అసలు బన్నీకి ఏమైంది..? (video)
బన్నీ మరోసారి వార్తల్లో నిలిచాడు. తన సినిమా వార్తలతో కాదండోయ్. సైరాకి దూరంగా ఉండడం వలన. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్. ఆ మధ్య చెప్పను బ్రదర్ అని కామెంట్ చేసి పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో మెగా అభిమానుల్లో ఈ వివాదం ముదిరింది. ఆఖరికి ఏడాదిన్నర తర్వాత ఈ వివాదం ముగిసింది.
పవర్‌స్టార్‌తో కలిసిపోయాడు అల్లు అర్జున్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా జనసేన తరఫున పాలకొల్లు ప్రాంతంలో ప్రచారం చేశాడు. ఆ విధ్యంగా బన్నీ ఫ్యాన్స్‌కి, పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కి ప్యాచప్ అయింది.
మెగా విభేదాలకి దాంతో ప్యాకప్ పడింది అని అనుకున్నారంతా. ఇపుడు బన్నీ మరో వివాదానికి తెర తీసినట్టు అయ్యింది. ఇంతకీ మేటర్ ఏంటంటే... సైరా సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాయి.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, అమితాబ్ బచ్చన్, అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, రాజమౌళి, విజయ్ దేవరకొండ, నాని మొదలుకొని... సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖలందరూ ట్వీట్ చేశారు. ట్రైలర్ ని మెచ్చుకున్నారు. కానీ... బన్నీ మాత్రం తన సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రైలర్ ను షేర్ చేయలేదు. కామెంట్ పెట్టలేదు.
ఇదిలా ఉంటే... సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ..ఇలా మెగా హీరోలందరూ వచ్చారు కానీ.. బన్నీ రాలేదు. దీంతో మళ్ళీ మెగా ఫ్యామిలీలో బన్నీ వివాదం మొదలైందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అసలు.. బన్నీ ఎందుకు సైరా వేడుకకు రాలేదు. ప్రచారంలో ఉన్న వార్తలు నిజమేనా..? కాదా..? మరి.. బన్నీ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
