సంబంధిత వార్తలు
- వదల 'సైరా' నిన్నొదలా... చిరు, చరణ్ లపై ఉయ్యాలవాడ వారసుల ఫిర్యాదు...
- మా అన్నయ్య నేర్పిన సంస్కారం అదే... ఎవరు హిట్ కొట్టిన ఆనందమే : పవన్ కళ్యాణ్
- సైరా ఫంక్షన్లో అందరికీ షాక్ ఇచ్చిన పవన్... ఇంతకీ ఏం చేసాడు..? (video)
- అన్నయ్యను కొట్టేటోడు మళ్లీ పుట్టడు : పూరీ జగన్నాథ్
- ''సైరా'' ప్రీ రిలీజ్ ఈవెంట్.. రాజమౌళి స్పీచ్.. మెగాస్టార్ హ్యాపీ హ్యాపీ
మెగాస్టార్ సైరాకు యు/ఏ సర్టిఫికేట్.. విడుదలకు సిద్ధం
మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రం ఫ్రీరిలీజ్ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్ వేదికగా జరిగింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, తమన్నా హీరోయిన్లు కాగా, బిగ్ బి అమితాబ్, జగపతిబాబు, కిచా సుధీప్, విజయ్ సేతుపతి వంటి అగ్రనటులు కీలక పాత్రల్లో పోషించారు.
ఈ చిత్రం గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబరు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. చిరంజీవి కెరియర్లోనే తొలి చారిత్రక చిత్రంగా 'సైరా' భారీ బడ్జెట్‌తో చిరంజీవి తనయుడైన హీరో రామ్ చరణ్ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు.. హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదలకానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి ఒక్క కట్ కూడా చెప్పకుండా యూ/ఏ సర్టిఫికేట్‌ను మంజూరు చేయడం విశేషం. వారం రోజుల ముందుగానే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకి సిద్ధమైపోయింది.
