అన్నయ్యను కొట్టేటోడు మళ్లీ పుట్టడు : పూరీ జగన్నాథ్

puri jagannadh
Last Updated: సోమవారం, 23 సెప్టెంబరు 2019 (12:32 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన "సైరా నరసింహా రెడ్డి" ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, వివి వినాయక్, తదితరులు పాల్గొన్నారు. హీరో రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్ అత్యంత కీలక పాత్రను పోషించారు.

దీన్ని పురస్కరించుకుని డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ చిరు, చ‌ర‌ణ్‌ల‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. 'చాలా ఏళ్ల ముందు చ‌ర‌ణ్ నాతో డాడీతో ఓ మొమ‌ర‌బుల్ మూవీ తీయ్యాలి. మ‌నం అంద‌రం ఫ్రౌడ్‌గా ఫీల‌య్యే సినిమా కావాలన్నాడు. మొన్న రిలీజ్ అయిన 'సైరా' టీజ‌ర్ చూడ‌గానే నాకు చ‌రణే గుర్తుకొచ్చాడు. నిజంగా త‌ను నాకు చెప్పిన సినిమానే తీశాడు.

గ్రాండియర్‌గా కానీ.. విజువ‌ల్స్‌గా కానీ. సురేంద‌ర్ రెడ్డి అయితే ఇర‌గ్గొట్టేశాడు. ఇక అన్న‌య్య‌.. ఆయ‌న సీన్స్‌లో అన్న‌య్య‌ను కొట్టేటోడు మ‌ళ్లీ పుట్ట‌డు. ల‌వ్ యు అన్న‌య్య‌. ఓ మెగాస్టార్ అభిమానిగా 'సైరా' పెద్ద హిట్ అవ్వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ల‌వ్ యు' అంటూ వీడియోలో మాట్లాడగా, దాన్ని బీఏ రాజు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

దీనిపై మరింత చదవండి :