ప్రేమ్ కుమార్ పెళ్లి చూపులతో సరిపెట్టుకుంటాడా!
Prem Kumar
గ్లింప్స్ చూస్తే... సునందగారికి సింగిల్ సుపుత్రుడు, సుందర లింగానికి సోలో స్నేహితుడు, రోషన్ గాడికి రంకు మొగుడు, వరుడు చిరంజీవి చిం ప్రేమ్ కుమార్ అంటూ హీరోతో పాటు అతడి జీవితంలో కీలక పాత్రధారులను పరిచయం చేశారు. వధువుగా రాశీ సింగ్ ను సైతం చూపించారు. అయితే, పెళ్లి ఎందుకు ఆగిందనేది సస్పెన్స్ లో ఉంచారు. పెళ్లి కూతురు పీటలు ఎక్కకుండా ఎందుకు లేచిపోయింది అనేది చెప్పకుండా సినిమాపై ఆసక్తి పెంచారు.
దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ "ప్రేమ్ కుమార్ పెళ్లి ఆగింది సరే. అసలు ఎందుకు, ఎవరి వల్ల, ఎవరితో, ఎలా ఆగింది? అసలు పీకే కి పెళ్లి అవుతుందా? లేక అలానే ఉండిపోయి పెళ్లి చూపులతో సరిపెట్టుకుంటాడా? ఇంతకీ, పెళ్లి ఎప్పుడు? రానున్న రోజుల్లో ఇలాంటి వాటికి సమాధానం దొరుకుతుంది. అప్పటివరకు మా తొలి శుభలేఖ ఇదే" అని అన్నారు.
నిర్మాత శివప్రసాద్ పన్నీరు మాట్లాడుతూ "హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా ఇది. మా దర్శకుడు అభిషేక్ మహర్షి, రచయిత అనిరుధ్ కృష్ణమూర్తి కలిసి చక్కటి ఓ సరికొత్త కథ రాశారు. కథనం ఆసక్తి కలిగిస్తూ, నవ్విస్తుంది. సంతోష్ శోభన్ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం" అని అన్నారు.
తర్వాతి కథనం
