సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : సోమవారం, 26 జులై 2021 (14:22 IST)

నాకూ మంచి రోజులు వ‌చ్చాయిః మెహ్రీన్

Mehrin
`మారుతీగారి సినిమాను నేనే ఒప్పుకోడంతోనే నాకూ మంచి రోజులు వ‌చ్చాయి, మారుతి గారితో మ‌ళ్లీ క‌లిసి ప‌ని చేయ‌డం చాలా ఆనందంగా ఉంది, హీరో సంతోష్ శోభ‌న్ న‌ట‌న‌కు నేనే పెద్ద ఫ్యాన్, హాయిగా న‌వ్వుతూనే మ‌నలో చాలా మంది లోలోప‌ల అనుభ‌విస్తున్న ఓ వింత రోగానికి మెడిసిన్ మాదిరిగా ఈ మంచి రోజులు సినిమా పనిచేస్తోంది, అంద‌రూ త‌ప్ప‌కుండా ఈ చిత్రాన్ని చూసి మమ‌ల్ని ఎంక‌రేజ్ చేస్తార‌ని న‌మ్ముతున్నాను అని` హీరోయిన్ మెహ్రీన్ అన్నారు
 
యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా `మంచి రోజులు వచ్చాయి`. `ఏక్ మినీ కథ` హీరో సంతోష్ శోభన్ న‌టిస్తున్నారు. మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను వి సెల్యులాయిడ్, SKN నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. దీనికి అద్భుతమైన స్పందన ల‌భించింది, ఈ నేప‌థ్యంలోనే విడుద‌లైన క్యారెక్ట‌ర్ ఇంట్రో లుక్ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది, అన్ని వర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. హైద‌రాబాద్ ట్రెడెంట్ హోట‌ల్ లో ఈ క్యారెక్ట‌ర్ లుక్ వీడియో రిలీజ్ కార్య‌క్ర‌మాన్ని అంగ‌రంగ వైభవంగా నిర్వ‌హించారు,
 
ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ, న‌వ్వు అనే విష‌యానికి దూరం అయిపోయి ఒక రక‌మైన భ‌యంలోకి మ‌న‌మంతా వెళ్లిపోయాం. క‌రోనా రాక‌పోయినా భ‌యం అనే రోగాన్ని పెంచుకొని చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి సంఘ‌ట‌ణ‌లు చూసి నా వంతు కృషిగా ఏదైనా చేయాలి అనే అలోచ‌న నుంచి పుట్టిన సినిమానే మంచి రోజ‌లు వ‌చ్చాయి. ఈ సినిమాను మెరుపు వేగంతో ముగించి థియేట‌ర్స్ లో విడుద‌ల చేయాల‌ని ల‌క్ష్యంతో మా యూనిట్ అంతా వ‌ర్క్ చేశాం క‌నుక ఎలాంటి భ‌యాలు లేకుండా ప్రేక్ష‌కులు కూడా థియేట‌ర్ల‌కు వ‌చ్చి ఈ సినిమా చూస్తార‌ని అలాంటి మంచి రోజులు అతి త్వ‌ర‌లోనే వ‌స్తాయ‌ని ఆశిస్తున్నానని అన్నారు‌
 
manchi rojulu team
నిర్మాత ఎస్ కే ఎన్ మాట్లాడుతూ, మ‌హానుభావుడు త‌రువాత మెహ్రీన్ తో క‌లిసి ప‌నిచేయ‌డం, రైజింగ్ హీరో సంతోష్ శోభ‌న్ తో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం ఆనందంగా ఉంది. క‌రోనా ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ గా జ‌ర్న‌లిస్టుల్ని చేర్చాలని తెలిపారు.
 
హీరో సంతోష్ శోభ‌న్ మాట్లాడుతూ, హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు ఉంటాయి కానీ ముఖ్య‌మైన సినిమాలు చాలా అరుదుగా ఉంటాయి. దర్శ‌కుడు మారుతిగారు ఈ మంచి రోజులు వ‌చ్చాయి చిత్రాన్ని ఓ ముఖ్య‌మైన సినిమాగా అంద‌రూ చూసి తీరాల్సిన చిత్రంగా మ‌లిచారు. ఇంత మంచి సినిమాలో నాకు అవ‌కాశం ఇచ్చినందుకు మారుతి గారికి నా ప్ర‌త్యేక‌మైన కృతజ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాను. ప్రేక్ష‌కులు ఈ చిత్రాన్ని థియేట‌ర్స్ లో చూసి మ‌మ‌ల్ని ప్రొత్స‌హిస్తార‌ని ఆశిస్తున్నాను అన్నారు.