1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
  4. Deewana movie review with a different theme

Deewana review : భిన్నమైన నేపథ్యంగా దీవానా చిత్రం రివ్వ్యూ

Harshit Reddy, Sneha Manimegalai
Harshit Reddy, Sneha Manimegalai
నటీనటులు : హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై, నరేష్ తదితరులు
సాంకేతికత: సినిమాటోగ్రఫీ : వంశీ పచ్చిపులుసు, సంగీతం : ఈశ్వర్ చంద్,  ఎడిటింగ్ : రిషికేశ్ పసపల్, నిర్మాత : అర్హ మీడియా, వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి, దర్శకత్వం : శ్రీకాంత్ సంగిశెట్టి
 
కథ :
మధ్యతరగతికి చెందిన మున్నా (హర్షిత్ రెడ్డి) స్నేహితులతో ఆవారా తిరిగే డిగ్రీ చదివిన కుర్రాడు. కుటుంబం గురించి పెద్దగా పట్టించుకోడు. వయస్సు ప్రభావం వల్ల ఆ ఊరిలో మీసేవలో పనిచేసే అమూల్య (స్నేహ మణిమేఘలై)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఆమె ప్రేమకోసం ఏదోరకంగా వచ్చిపోతూంటాడు. కానీ ఆమె అస్సలు పట్టించుకోదు. అయితే ఆమెపై ఎవరైనా ఏడిపిస్తుంటే వారికి బుద్ధి చెప్పే క్రమంలో జైలుకు వెళ్ళాల్సివస్తుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అమూల్యకు మున్నా ప్రపోజల్ చేస్తే, ఏదైనా ప్రభుత్వం కొలువు తెచ్చుకో అని షరతు పెడుతుంది..ఆ తర్వాత ఆమె షరతు నెరేర్చాడా? లేదా? అనంతరం జరిగిన పరిణామాలు ఏమిటి? అనేది మిగిలిన సినిమా. 
 
సమీక్ష:
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ నుండి వచ్చిన భిన్నమైన చిత్రాలలో ‘దీవానా’ ఒకటి. కథలో ప్రతి పాత్రకూ ఒక ప్రత్యేక ప్రాధాన్యతను కల్పిస్తూ కథా గమనాన్ని నడిపించిన తీరు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఒక పార్శ్వ్యంలో  గుండెల్ని పిండేసే ఒక లవ్ స్టోరీ నడుస్తుంటుంది. హీరో హీరోయిన్ల ప్రేమకథకు అడ్డుగా నిలిచే ఒక షాకింగ్ పాయింట్ నేపథ్యంలో ఈ కథను నడిపించిన తీరు వీక్షకులను కదిలిస్తుంది. అయితే ఓ దశలో స్నేహితులతో  అల్లరి వేషాల దగ్గర్నుంచి.. ప్రేమ-ఉద్యోగం అంటూ అతను పడే పాట్లకు  చికాకు పుట్టించేస్తాయి. దానిని దర్శకుడు మరింత చాకచక్యంగా తీర్చిదిద్దాల్సింది. టోటల్ గా  దీవానా’ తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ఒకటిగా నిలిచేది. అయితే ఇందులో రెండు పాత్రలకు వివిధ లోపాలున్నా అవి గత సినిమాలకు పోలిక వున్నట్లు అనిపించకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు.
 
కథలో భాగం సహజత్వానికి కమర్షియల్ ఎలిమెంట్స్‌ను చక్కగా బ్యాలెన్స్ చేసింది. ఇదే ‘దీవానా’ చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. నిజమైన లోకేషన్లలో హీరో ప్రపంచాన్ని చూపిస్తూ సినిమాను న్యాచురల్‌గా తెరకెక్కించిన విధానం ఈ చిత్రానికి ఒక పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ముఖ్యంగా, వినోదంతో పాటు ఎమోషన్స్ కూడా తోడవ్వడంతో సినిమా కథనం ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. కొన్ని సన్నివేశాలు కాస్త ఇబ్బందికరంగా అనిపించినా, అందులోని డ్రామా మరియు డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. అలాగే తండ్రీ-కొడుకుల బంధం, స్నేహం తాలూకు యాంగిల్స్ మెప్పిస్తాయి.
 
ఇక, ఫస్ట్ హాఫ్ పూర్తిగా సెకండ్ హాఫ్‌లోని కీలక సన్నివేశాలకు బాటవేసేలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.  అలాగే ఇందులో కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ కొంతమంది ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికేట్ ఇవ్వడంతో ప్రేక్షకులు ఇలాంటి సీన్స్‌కు ప్రిపేర్ అయ్యి వెళ్తే మంచిది.
 
 పతాక సన్నివేశాలను క్లోజప్స్ మీద నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. రచయిత-దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి అరంగేట్రంలో తన ముద్ర వేశాడు. డిఫరెంట్ పాయింట్ రాసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సీన్ల వరకు రైటింగ్-టేకింగ్ రెండూ వేరే లెవెల్ అనిపిస్తాయి. కానీ మిగతా సన్నివేశాల్లో మాత్రం శ్రీకాంత్ ఆ ప్రమాణాలను అందుకోలేకపోయాడు. ఓవరాల్ గా రైటర్-డైరెక్టర్ గా శ్రీకాంత్ బాగా డీల్ చేశాడు ఎడిటింగ్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. చిన్న పాటి లోపాలున్నా...రొమాంటిక్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
రేటింగ్ : 3/5
About Writer
దేవీ
తర్వాతి కథనం
Allu Arjun: మేక్ ఏ విష్ ఇండియా ద్వారా చిన్నారి శ్ర‌ద్ధా తో ప్ర‌త్యేకంగా మాట్లాడిన‌ అల్లు అర్జున్‌