ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 26 మే 2023 (21:18 IST)

మంచి కథాంశతో తీసిన మెన్ టూ ఎలా ఉందంటే ! రివ్యూ

men too
men too
నటీనటులు : నరేష్ అగస్త్య, ప్రియాంక శర్మ, కౌశిక్, మౌర్య సిద్ధవరం, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, రియా సుమన్  తదితరులు
సాంకేతికత: ఛాయాగ్రహణం : పీసీ మౌళి, సంగీతం : ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్, రచన, దర్శకత్వం : శ్రీకాంత్ జి. రెడ్డి, నిర్మాత : మౌర్య సిద్ధవరం, విడుదల తేదీ: మే 26, 2023
 
మెన్ టూ అనే చిత్రం పేరు వినగానే చాల ఆసక్తి యూత్ లో కలిగింది. దానికితోడు టీజర్, ట్రైలర్లతో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిన సినిమా ఇది.  శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కి ఇందులో హీరోగా నటించిన మౌర్య సిద్ధవరం యే నిర్మాత కూడా. ఈ చిత్రానికి సంగీతం ఎలీషా ప్రవీణ్, ఓషో వెంకట్. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఏమాత్రం యూత్ ని అలరించిందో చూద్దాం పదండి.
 
కథ: 
ఓ నలుగురు యువకులు ఆదిత్య(నరేష్ అగస్త్య), సంజు(కౌశిక్), మున్నా(మౌర్య సిద్ధవరం), రాహుల్(వైవా హర్ష). అందరూ ఏదోక సమయంలో అమ్మాయిల బాధితులే. అందుకే  ఓ పబ్ లో రెగ్యులర్ కలుసుకుని తమ జీవితాల్లో జరిగిన సంఘటనలను, కష్టనష్టాలను ఒకరితోనొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఆ పబ్ ఓనర్(బ్రహ్మాజి), అందులో పనిచేసే బాయ్(సుదర్శన్) కూడా వారి సాదక బాధకాలు షేర్ చేసుకుంటారు. బాధితుడు హర్ష (రాహుల్) విషాదకర మరణం వీరి పై ప్రభావం చూపిస్తోంది. మెన్ టూ అంటూ ఆడవాళ్ళ బాధితుల బాధను తమదైన శైలిలో వీరంతా తెలియజేస్తారు. అనేక  సమస్యలతో ఇబ్బందులు పడే మగాళ్లంతా... చివరకు ఏమి చేశారనేదే మిగతా కథ. 
 
విశ్లేషణ: 
ఆడవాళ్ళ భాదితుల సమస్యలే అయినా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా చూపించాడు. ప్రధానంగా ఆడవారి బాధితుల నేపథ్యం, ఆ నేపథ్యంకి సంబంధించిన ట్రాక్, అలాగే ఆ ట్రాక్ తో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి మెన్ టూ కొన్ని చోట్ల పర్వాలేదు. మీ టూ అనేది అందరికి తెలిసిందే మెన్ టూ అనేది టచ్ చేయడం బాగుంది  అబ్బాయిలు కూడా అనే నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో నిత్యం మనం చుట్టూ యువతీ యువకుల్లో జరిగే అంశాలను బేస్ చేసుకుని... కొంత మెసేజ్ ఇస్తూనే... యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా మలిచారు దర్శకుడు. గ్రిప్పింగ్ కథ... కథనాలతో ఎక్కడా బోర్ లేకుండా నలుగురు యువకుల మధ్య జరిగిన సంఘటనలను ఎంతో ఎమోషనల్ గా తెరపై ఆవిష్కరించారు దర్శకుడు. 
 
మొదటి హాఫ్ లో రాహుల్ కథతో ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ నిచ్చిన దర్శకుడు... ఆ తరువాత ద్వితీయార్థం అంతా ఎమోషనల్ గా నడిపించి... ఆడియన్స్ ని సినిమాలోని మల్టిపుల్ ట్రాక్స్ కి కనెక్ట్ చేయడంలో విజయం సాధించారు. వర్క్ ప్లేస్ లో కేవలం అమ్మాయిలకే ప్రాధాన్యం ఇచ్చే ఎంఎన్సీ కంపెనీలు   అబ్బాయిలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే అమ్మాయిల అభిప్రాయాలను గౌరవించాలనే దానిని ఆదిత్య పాత్రతోనూ, అమ్మాయిలు... అబ్బాయిలకు కారణం లేకుండా బ్రేకప్ చెప్పడం లాంటి వాటిని ఫేస్ చేసే పాత్రలో సంజు పాత్రను, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినా... తన ప్రియురాలికి తన ప్రేమను చెప్పలేని పాత్రలో మున్నా పాత్రని ఎంతో ఎమోషనల్ గా తెరమీదకెక్కించారు దర్శకుడు. 
 
ఇలా... మెన్ కూడా అమ్మాయిలలాగే అన్ని విధాలుగా ఇబ్బందులు అన్నిచోట్లా ఎదుర్కొంటూనే ఉంటారు... వారికి కూడా ఓ వేదిక కావాలి అభిప్రాయాలను పంచుకోవడానికి అనేదానితో తెరకెక్కిన ఈచిత్రం ఆద్యతం అలరిస్తుంది.
 
కొన్ని సన్నివేశాలు అయితే ముందే అర్థం అయిపోతుంటాయి. మొత్తానికి దర్శకుడు తానూ అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద ఇంట్రస్ట్ కలిగించేలా ఎలివేట్ చేయలేకపోయారు.
ఇందులో నరేష్ అగస్త్య పాత్ర చాలా మంది యువతకు మెసేజ్ ఇస్తుంది. అలాగే కౌషిక్ కూడా కాస్త ఫెరొషియస్ గా కనిపించి మెప్పించాడు. మున్నా పాత్రలో చిత్ర నిర్మాత మౌర్య ఆకట్టుకుంటాడు. గీతా పాత్రలో రియా సుమన్... గ్లామరస్ గా కనిపించి మెప్పించింది. భార్య బాధితునిగా బ్రహ్మాజీ నవ్వించాడు. బార్ లో పనిచేసే యువకుని పాత్రలో సుదర్శన్ ఆకట్టుకుంటాడు. వైవా హర్షా చేసిన పాత్ర కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. ఇక మిగత పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకుంటాయి. 
దర్శకుడు రాసుకున్న కథ... కథనాలు గ్రిప్పింగ్ గా ఉన్నాయి. ఆద్యంతం ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. సంగీతం పర్వాలేదు. నిర్మాత ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని నిర్మించారు.ఇక మొత్తంగా చూస్తే ఈ “మెన్ టూ”లో మెయిన్ పాయింట్ అండ్ కొన్ని కామెడీ సీన్స్ మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్ పర్వాలేదు. కొన్ని సన్నివేశాలు సీరియస్ గా చూపిస్తే మరింత బాగుండేది. చిన్న చిన్న లోపలున్న మెన్ టూ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా. 
రేటింగ్: 3/5