మంగళవారం, 14 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 9 డిశెంబరు 2022 (11:20 IST)

పంచతంత్రం ఎలా ఉందంటే : రివ్యూ

Panchatantram poster
Panchatantram poster
నటీనటులు: బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు.
 
సాంకేతిక వర్గం: బ్యాన‌ర్స్‌: టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్, నిర్మాతలు: అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు, రైటర్‌–డైరెక్టర్‌: హర్ష పులిపాక, లైన్ ప్రొడ్యూసర్: సునిత పడోల్కర్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: భువన్‌ సాలూరు, క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉషారెడ్డి వవ్వేటి, సంగీత దర్శకులు: ప్రశాంత్ ఆర్ విహారి, శ్రవణ్ భరద్వాజ్, సహ నిర్మాతలు: రమేష్ వీరగంధం, రవళి కలంగి, మాటలు: హర్ష పులిపాక, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సోసియేట్ డైరెక్టర్: విక్రమ్, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: అయేషా మరియం, ఎడిటర్‌: గ్యారీ బీహెచ్‌, సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె. నల్లి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సాయి బాబు వాసిరెడ్డి,  పి.ఆర్‌.ఓ:  నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా).
 
కొత్త తరం సినిమా రంగంలోకి రావడంతో కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. అందులో యాంథాలజీ (సంకలనం) పేరుతో నాలుగు, ఐదు కథల్ని చెప్పేస్తున్నారు. ఒక కథను చెప్పడానికే దర్శకులకు కష్టం అవుతున్న నేపథ్యంలో ఏకంగా ఐదు కథలు ఐదు కుటుంబాలు వారి ఎమోషన్స్‌ను చూపిస్తూ క్లయిమాక్స్‌లో లింక్‌ చేస్తూ ప్రయోగాలు చేస్తున్నారు. గతంలో చందమామ కథలు వచ్చింది. అదేకోవలో ఇప్పుడు పంచతంత్రం ఈరోజే విడుదలైంది. ఎలా వుందో చూద్దాం.
 
కథలుగా చెప్పాలంటే,
1. వేదవ్యాస్‌ (బ్రహ్మానందం) రిటైర్‌ ఉద్యోగి. ఆల్‌ ఇండియా రేడియోలో చేసేవాడు. రిటైర్‌ తర్వాతన తనకు వచ్చిన ఐడియాలను అమలు చేయడానికి ఆడియో కేటెట్‌ ద్వారా కథలను దాచుకుంటాడు. 60 ఏళ్ళ వయస్సులోని అనుభవాలు, ఆలోచనలే కథలుగా చెప్పడం కూతురు కలర్స్‌ స్వాతికి ఇష్టం వుండదు. 60 ఏళ్ళ వయస్సులోనూ 20 ఏళ్ళవారితో పోటీపడాలనుకుంటాడు. ఆ తర్వాత ఏమయింది? అనేది మిగిలిన కథ.
2 . నరేష్‌ అగస్త సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. చక్కటి జీతం వస్తున్నా, ఏదో తెలీని దిగులు. పని ఒత్తిడికి గురై కోపం, ప్రస్టెషన్‌కు లోనవుతాడు. స్నేహితుల వల్ల బీచ్‌ గురించి విని బీచ్‌ దృశ్యం చూడాలని ఉత్సాహపడతాడు. ఆ తర్వాత ఏమయింది? అనేది మిగిలిన సారాంశం.
3. రాహుల్‌ విజయ్‌ ఇంట్లో పెండ్లి సంబంధాలు చూస్తారు. తన ఆలోచనలకు తనకెవరూ నచ్చరు. అమ్మ ఒత్తిడి మేరకు శివాత్మికను చూసి ఫిక్స్‌ చేస్తారు. ఆ తర్వాత శివాత్మికనుంచి ఫోన్‌ కాల్‌ రావడంతో కలుస్తాడు. ఆ తర్వాత ఏమయింది? అనేది కథ.
4.  దివ్య, వికాస్‌ లవ్‌ మేరేజ్‌ చేసుకుంటారు. హాయిగా సాగుతున్న వారి జీవితంలో చిన్న అపసృతి జరుగుతుంది. గర్భవతిగా వున్న దివ్యకు షడెన్‌గా బ్లీడిరగ్‌ అవుతుంటే ఆసుపత్రికి తీసుకెళతారు. కేన్సర్‌ వుందని డాక్టర్‌ చెప్పడంతో వారు తీసుకున్న నిర్ణయమే మిగిలిన కథ.
5.  చిన్నపిల్లలకు కథలు చెప్పే కలర్స్‌ స్వాతి అంటే అభిమానులు పెరుగుతారు. ఉత్తేజ్‌ కూతురు కూడా ఆమె కథకు ఫ్యాన్‌. అన్నం తినాలంటే కథ వినాల్సిందే. అంతలా ఎడిక్ట్‌ అయిన వారిద్దరి కథ ఏమిటి? అనేది మిగిలిన కథ.
 
విశ్లేషణ:
 
కదిలే కాలానికి మనిషే నేస్తం. కబురు చెప్పే పనిలో ఐదుకథలు.. రేపటి ప్రశాంతకు నిన్నటి బదులంట .. అంటూ కాలభైరవ పాట ఈ సినిమాకు నిదర్శనం. అందుకే  జీవిత సారాంశాన్ని, పంచ భూతాల అంశాన్ని ఈ కథల రూపంలో దర్శకుడు మలిచాడు. దర్శకుడు హర్ష సమాజంలో మన చుట్టూ జరిగితే విషయాలను సినిమా కథగా ఎంచుకున్నాడు. ఒక కథనే ఆసక్తిగా చెప్పడంలో చాలా మంది విఫలం అవుతున్నట్లే దర్శకుడు హర్ష కూడా ఐదు కథలనేపథ్యంలో కొంత ఫీల్‌ మిస్‌ అయ్యాడనే చెప్పాలి. మొదటి కథలో ఎమోషన్‌కు ఫీల్‌ కాలేకపోతారు. రెండో కథలో మాత్రం శివాత్మిక ,రాహుల్‌ ప్రేమకథలో కొంచెంది ఫీల్‌తో ఆడియన్‌ కనెక్ట్‌ అవుతాడు. మూడోది మాత్రం సుముద్ర ఖని పాత్రలో గతానికి లింక్‌ చేస్తూ కూతురు విషయంలో కాస్త ఇబ్బంది గురిచేసే అంశంతో ఫీల్‌ కలగదు. దివ్య, వికాస్‌ల కేన్సర్‌ పోరాటం ఘర్షణ హృదయాన్ని టచ్‌ చేస్తాయి. స్వాతి, రూప చిన్నారి మధ్య సన్నివేశాలు టచ్‌ చేస్తాయి.
 
నటనాపరంగా బ్రహ్మానందం తనదైన శైలిలో చేసుకుంటూ పోయారు. తనకు ఇదొక వైవిధ్యమైన పాత్రని చెప్పాలి. కలర్స్‌ స్వాతికి మరలా నటిగా మెప్పించే సినిమా. రాహుల్‌, శివాత్మికలు బాగానే నటించారు. ఇక మిగిలిన పాత్రలన్నీ కథాపరంగా మెప్పించారు.
 
ఇక సాంకేతికంగా చెప్పాలంటే, దర్శకుడు హర్ష ఈ కథల్ని సీరియస్‌ మోడ్‌లో చెప్పుకుంటూ పోవడంతో ఎక్కడా వినోదం పాళ్ళు లేకపోవడంతో కాస్త లోపంగా కనిపిస్తుంది. కథకుడిగా చెప్పేవిధానంలో ఆయన ప్రతిభ ఇందులో కనిపించింది. ఇలాంటి కథలకు నేపథ్య సంగీతం, బీజియంలు కీలకం. వాటిని ప్రశాంత్‌ విహార్‌ బాగా చేశారు. వల్లి కెమెరాపనితం బాగుంది. నిర్మాతలు రిచ్‌గానే తీశారు. ఓ పోయెటిక్‌ సెన్స్ లో తీసిన చిత్రమిది.  భావాల వారికి నచ్చుతుంది.  ఇలాంటివి ఓటీటీలో సరదాగా చూస్తారుకానీ, థియేటర్‌లో ఎంతమేరకు ఆదరణ అనేది తెలియాల్సి వుంది.
రేటింగ్: 2.5/5