సంబంధిత వార్తలు
నాగబాబు విడుదల చేసిన కొత్త రంగుల ప్రపంచం టీజర్
Kranti, Srilu
అనంతరం నటుడు సుమన్ మాట్లాడుతూ..కొత్త రంగుల ప్రపంచం టీజర్ చూస్తుంటే చాలా ప్రామిసింగ్ గా ఉంది.నటుడు పృద్వి మంచి కథను సెలెక్ట్ చేసుకొని దర్శకత్వం వహిస్తున్నాడు. హీరో, హీరోయిన్ లు కొట్టవారైనా చాలా బాగా నటించారు. కొత్త వారు అని చూడకుండా కథను నమ్మి తీసిన ఈ సినిమా నిర్మాతలకు బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.
చిత్ర నిర్మాతలు పద్మ రేఖ,గుంటక శ్రీనివాస్ రెడ్డి, కుర్రి కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. పృద్వి చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాము. మా సినిమా ద్వారా పృద్వి గారి కూతురు హీరోయిన్ గా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకు పని చేసిన వారంతా ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. మంచి కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకొని తీసిన మా కొత్త రంగుల ప్రపంచం.సినిమా టీజర్ ను విడుదల చేసిన నాగబాబు కు ధన్యవాదాలు.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందన్నారు.
kotha rangula prapancham team
హీరోయిన్ శ్రీలు మాట్లాడుతూ.. మా నాన్న దర్శకత్వంలో హీరోయిన్ గా పరిచయం అవుతున్నందుకు చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నన్ను మీరందరు ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
హీరో క్రాంతి మాట్లాడుతూ.. ఇలాంటి మంచి కథలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.
తర్వాతి కథనం
