అద్భుతం అనేలా బేబీ చిత్రం నుంచి సెకండ్ లిరికల్ సాంగ్
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బేబీ.ఈ చిత్రం నుంచి గతంలో విడుదల చేసిన ఫస్ట్ లిరికల్ సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సెకండ్ రిలికల్ సాంగ్ ను విడుదల చేసింది మూవీ టీమ్. మొదటి పాటకు పూర్తి భిన్నంగా ఉంటూనే వైవిధ్యమైన టోన్ లో మరో అద్భుతమైన పాటలా కనిపిస్తోంది. ఈ పాటను మళయాలంలో మోస్ట్ ఫేమస్ సింగర్ గా పేరు తెచ్చుకున్న ఆర్య దయాళ్ చేత పాడించారు. అంతే కాదు.. ఓ పెద్ద బడ్జెట్ సినిమా రేంజ్ లో భారీ సెట్స్ వేసి మరీ ఈ గీతాన్ని వీడియోగానూ చిత్రీకరించారు. ఆ పాటలో ఆర్యదయాళ్ స్వయంగా యాక్ట్ చేయడం విశేషం.
విజయ్ బుల్గానిన్ స్వరపరిన ఈ గీతాన్ని త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి రాశారు.
సంస్కృత పదాలతో మొదలైన పాట ఆసాంతం కట్టిపడేశాలా సాహిత్యం, కంపోజింగ్ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతం నుంచి నగరంలోని పెద్ద కాలేజ్ కు చదువుకోవడానికి వెళ్లిన ఓ అమ్మాయికి కనిపించే కొత్త ప్రపంచం అంతా నిజం కాదనీ.. నిజమనుకునే క్రీనీడలే అడుగడుగునా ఉంటాయనీ.. తెలుపదు కదా ఓ పాఠమై చదువే.. భ్రమల మైకాన భ్రమణమే చేసి భ్రమరమవుతుంది కాలమే.. అనే అద్భుతమైన సాహితీ విలువలున్న ఈ గీతం మాంటేజ్ సాగే పాటలా ఉంది. మొదటి పాటకు వచ్చిన రెస్పాన్స్ తర్వాత కథను ముందుకు నడిపించేలా ఉన్న ఈ గీతం కూడా బేబీపై అంచనాలు పెంచేలా ఉంది. మ్యూజికల్ గా బేబీ మరో సంచలనం కాబోతోందని రెండో పాట కూడా చూసిన తర్వాత అర్థం అవుతోంది.
హృదయ కాలేయం, కలర్ ఫోటో, కొబ్బరిమట్ట చిత్రాలతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేశ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కేఎన్ నిర్మించిన చిత్రం ఇది..
ఇక త్వరలోనే విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, లిరీష తదితరులు నటించారు.
టెక్నీకల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతోన్న ఈ చిత్రానికి సంగీతంః విజయ్ బుల్గానిన్, ఎడిటింగ్ః విప్లవ్ నైషధం, సినిమాటోగ్రఫీః ఎమ్ఎన్ బాల్ రెడ్డి, పి.ఆర్.వోః జిఎస్.కే మీడియా, కో ప్రొడ్యూసర్ః ధీరజ్ మొగిలినేని, నిర్మాతః ఎస్.కే.ఎన్, రచన, దర్శకత్వంః సాయి రాజేశ్