బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 మార్చి 2023 (14:03 IST)

పొరుగింటి 13 ఏళ్ల అబ్బాయితో రొమాన్స్... గర్భం.. బిడ్డ పుడితే తండ్రి?

romance
ఆధునిక పోకడల పుణ్యమా అంటూ పొరుగింటి వారితోనూ కాస్త జాగ్రత్తగా వుండాలని చెప్పే కథే ఇది. ఇంట్లో పని వుందని.. సాయం చేయాలని పొరుగింటి బాలుడిని లొంగదీసుకోవాలని ఓ మహిళ సక్సెస్ అయ్యింది. 
 
అతడిపై వ్యామోహంతో పదే పదే ఇంటికి పిలిచి శారీరక సంబంధం ఏర్పరుచుకుంది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాలుడిని ఆమె కోరింది. చివరకు ఆమె గర్భం దాల్చడంతో గుట్టు రట్టు అయ్యింది. 
 
అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో వెలుగుచూసిన ఈ ఘటనతో పోలీసులు రంగంలోకి దిగి ఆండ్రియా సెరానో (31)ను అరెస్ట్ చేశారు. 
 
మైనర్‌పై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు మోపారు. తమ మధ్య లైంగిక సంబంధం వున్న మాట వాస్తవమేనని కోర్టులో ఆండ్రియా అంగీకరించింది. 
 
కడుపులో పెరుగుతున్న బిడ్డకు.. ఆ బాలుడే తండ్రి అని చెప్పింది. మహిళ ఆరోగ్య పరిస్థితి కారణంగా ఆమెను కోర్టు విడుదల చేసింది. 
 
ఇరు పక్షాల రాజీతో కుదిరిన నేపథ్యంలో కేసును ముగించేందుకే కోర్టు ప్రయత్నించింది. కానీ పుట్టబోయే బిడ్డకు ఆ బాలుడిని తండ్రిగా పరిగణించాలని ఉత్తర్వులు జారీ చేసింది.