సంబంధిత వార్తలు
- నువ్వు ప్రేమికుడివి మాత్రమే, పెళ్లి నీతో కాదు: ప్రియుడు ఆత్మహత్య
- రంగరాయ వైద్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య - సూసైడ్ వీడియో
- ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవి శంకర్ ఆవిష్కరించిన కన్నప్ప లోని శివా శివా శంకరా పాట
- 'హెచ్.జె.టి-36' యుద్ధ విమానాన్ని నడిపిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
- మీ పిల్లలను జాగ్రత్తగా పెంచాలంటే... ఆ ఇడియట్స్‌కి దూరంగా ఉంచండి : రేణూ దేశాయ్
ప్రదీప్ రంగనాథన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ట్రైలర్ రిలీజ్
V.J. Sidhu, Indumati Manikandan
ఈ ట్రైలర్‌లో అన్ని రకాల అంశాలను జోడించారు. యూత్‌కి కావాల్సినంత వినోదం, ప్రేమ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్నింటినీ జోడించారు. ఇంజనీరింగ్‌లో 48 బ్యాక్‌లాగ్‌లు పెట్టుకున్న హీరో.. కాలేజీలో పనీ పాటా లేనీ గాలికి తిరిగే ఓ కుర్రాడిగా కనిపించాడు. ప్రేమ, బ్రేకప్, లైఫ్‌లో సెటిల్ అవ్వడం కోసం కష్టపడే తీరు ఇలా అన్నీ చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్‌ను కూడా ట్రైలర్‌లో చూపించారు. బాధత్యారాహిత్యంగా ఉండే కుర్రాడి జీవితంలో వచ్చే సమస్యలు, సవాళ్లను చూపిస్తూ.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఓ ఎంటర్టైనర్ మూవీ అవుతుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది.
ఈ చిత్రంలో కె. యస్. రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ వంటి స్టార్ డైరెక్టర్లు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో, టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక ఈ ట్రైలర్‌తో సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. ఈ మూవీకి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా అర్చన కల్పాతి, అసోసియేట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా ఐశ్వర్య కల్పాతి పనిచేస్తున్నారు.
లియోన్ జేమ్స్ సంగీతం అందించగా.. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫర్‌గా పని చేశారు, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటర్‌గా, ఎస్.ఎమ్. వెంకట్ మాణిక్యం ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో వి.జె. సిద్ధు, హర్షత్ ఖాన్, మరియం జార్జ్, ఇందుమతి మణికందన్, తేనప్పన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 21న థియేటర్లలో ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది.
